మళ్లీ పెళ్లి చేసుకుంటే... ఆస్తి ఇవ్వరా?

నా వయసు 32. మావారు రెండేళ్ల క్రితం కొవిడ్‌తో చనిపోయారు. నాలుగేళ్ల పాప ఉంది. ఇన్నాళ్లూ అత్త మామలు, మరిది కుటుంబంతో కలిసి ఉమ్మడిగానే జీవించాం.  ఆయన మరణం తర్వాత అత్తింట్లో మార్పు కనిపిస్తోంది. మరో పక్క అమ్మానాన్నలు నాకు మళ్లీ పెళ్లి చేయాలనే ఆలోచనలో ఉన్నారు.

Published : 18 Apr 2023 00:26 IST

నా వయసు 32. మావారు రెండేళ్ల క్రితం కొవిడ్‌తో చనిపోయారు. నాలుగేళ్ల పాప ఉంది. ఇన్నాళ్లూ అత్త మామలు, మరిది కుటుంబంతో కలిసి ఉమ్మడిగానే జీవించాం.  ఆయన మరణం తర్వాత అత్తింట్లో మార్పు కనిపిస్తోంది. మరో పక్క అమ్మానాన్నలు నాకు మళ్లీ పెళ్లి చేయాలనే ఆలోచనలో ఉన్నారు. అదే జరిగితే నాకూ, నా కూతురికి చిల్లిగవ్వ కూడా రానివ్వ నంటున్నారు అత్తమామలు. ఇంకో వివాహం చేసుకుంటే పిల్ల భవిష్యత్తు పాడవుతుందేమోనన్న భయం ఉంది. చట్టం ఏ విధంగా సాయం చేస్తుంది సలహా ఇవ్వగలరు.

- ఓ సోదరి

చిన్న వయసులోనే మీరు భర్తని దూరం చేసుకోవాల్సి రావడం దురదృష్టకరం. అమ్మానాన్నలు మీకు రెండో పెళ్లి చేస్తామనడంలో ఎటువంటి తప్పూ లేదు. నిజానికి అత్తమామలు కూడా మీ గురించి ఆలోచించాలి. అలాకాకుండా మీకు, పాపకు ఆస్తి రాకుండా అడ్డుపడాల నుకోవడం సరైనది కాదు. ఆస్తి మీ మామగారి స్వార్జితమైతే దాన్ని... తనకు నచ్చివారెవరికైనా ఇవ్వొచ్చు. అది వారి పిత్రార్జితమైతే మాత్రం దానికి మీ భర్త హక్కుదారు. అతడి వాటా తన పిల్లలకు వస్తుంది. ఒకవేళ మీ మామగారు ఎటువంటి వీలునామా రాయకుండా చనిపోతే ఆ ఆస్తి మీ అమ్మాయికి పిత్రార్జితం అవుతుంది. మీరు రెండో పెళ్లి చేసుకునే ముందు.. మీ తల్లీ కూతుళ్లకు జీవనభృతి ఇవ్వమని అత్తింటివారిని కోరొచ్చు. ఇందుకోసం మెయింటెనెన్స్‌ యాక్ట్‌లోని సెక్షన్‌ 19 ప్రకారం కేసు వేయాలి. గృహహింస చట్టం ద్వారానూ కేసు వేయొచ్చు. అందులో తీర్పు మీకు అనుకూలంగా వస్తే...మీరు పెళ్లి చేసుకున్నా మీ కూతురికి వచ్చే మొత్తాన్ని ఎవరూ ఆపలేరు. బంధాలు చెడిపోకూడదనుకుంటే ముందుగా మధ్యవర్తిత్వం ద్వారా ప్రయత్నించి... తర్వాత కోర్టుకి వెళ్లడం మేలు. ఆలోచించి నిర్ణయం తీసుకోండి.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్