రోజంతా ఉత్సాహంగా...

మనలో కొందరికి నడుము, తుంటి భాగాల్లో నొప్పి వస్తుంటుంది. ఇంకొందరు నరాల సమస్యలతో బాధ పడుతుంటారు. ఇక నెలసరి అపసవ్యతలు ఎదుర్కొంటున్న వారెందరో! వీటన్నిటికీ పరిష్కారంగా త్రివిక్రమాసనం ప్రయత్నించండి.

Published : 22 Apr 2023 00:16 IST

మనలో కొందరికి నడుము, తుంటి భాగాల్లో నొప్పి వస్తుంటుంది. ఇంకొందరు నరాల సమస్యలతో బాధ పడుతుంటారు. ఇక నెలసరి అపసవ్యతలు ఎదుర్కొంటున్న వారెందరో! వీటన్నిటికీ పరిష్కారంగా త్రివిక్రమాసనం ప్రయత్నించండి.

ది నిలబడి చేసే ఆసనం. ముందుగా కాళ్లు రెండూ దగ్గరగా పెట్టుకుని తిన్నగా నిలబడాలి. ఎడమ మోకాలిని వంచి చేతుల సాయంతో కాలిని మెల్లగా పైకి తీసుకువెళ్లాలి. ఆసరా కోసం చేత్తో తొడలు, పిక్కల దగ్గర పట్టుకోవచ్చు. ఫొటోలో చూపిన విధంగా ఎడమ కాలిని పైవరకూ వెళ్లనివ్వాలి. కుడిచేత్తో కాలి వేళ్లను, ఎడమచేత్తో మడాన్ని పట్టుకోవాలి. ఒంటికాలితో జాగ్రత్తగా బ్యాలెన్స్‌ చేసుకుంటూ ఎంతసేపు ఉండగలిగితే అంతసేపు ఉండి.. నెమ్మదిగా కాలిని కిందికి దించి సేదతీరాలి. తర్వాత ఇలాగే రెండో కాలితో చేయాలి.

ప్రయోజనాలు... త్రివిక్రమాసనంతో తొడలు, నడుము భాగంలోని కండరాలు దృఢత్వాన్ని సంతరించుకుంటాయి. రుతుక్రమం సమయానికి రాకపోవడం, కడుపునొప్పి, వికారం లాంటి ఇబ్బందులు తొలగుతాయి. గర్భాశయ, అండాశయాల్లో ఉన్న దోషాలు నయమవుతాయి. నరాల వ్యవస్థ పటిష్టమవుతుంది. రక్తప్రసరణ సాఫీగా జరిగి రోజంతా ఉత్సాహంగా, ఉత్తేజంగా ఉంటుంది.

జాగ్రత్తలు... ఇది క్లిష్టమైన ఆసనం. చాలా జాగ్రత్తగా చేయాలి. ఒకేసారి రాదు. మెల్లగా సర్వాంగాసనం లాంటివి వేశాకే దీన్ని ప్రయత్నించాలి. అలాగే వార్మప్‌ ఎక్సర్‌సైజులు లేకుండా నేరుగా ఈ ఆసనం వేయకూడదు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్