అందంగా ఉన్నానని వివక్ష చూపిస్తున్నారు!

సాధారణంగా రంగు తక్కువ, పొట్టి...ఇలా ఏదో ఒక లోపం ఉన్నవాళ్లకి సమస్య ఉంటుంది కదా! నా పరిస్థితి ఇందుకు భిన్నం. చూడటానికి బాగానే ఉంటాను నేను.

Published : 17 May 2023 00:25 IST

సాధారణంగా రంగు తక్కువ, పొట్టి...ఇలా ఏదో ఒక లోపం ఉన్నవాళ్లకి సమస్య ఉంటుంది కదా! నా పరిస్థితి ఇందుకు భిన్నం. చూడటానికి బాగానే ఉంటాను నేను. కాకపోతే తొందరగా నలుగురితో కలవలేను. దీంతో అందంగా లేమని మమ్మల్ని చిన్నచూపు చూస్తోంది అంటూ సహోద్యోగులు ఇబ్బంది పెడుతున్నారు. పై వాళ్లకి ఫిర్యాదు చేస్తున్నారు. పనిలో సందేహాలు, సలహాలు అడిగినా సహకారం ఉండట్లేదు. ఈ పరిస్థితిని ఎదుర్కొనేదెలా?

- ఓ సోదరి

హిళలు పనిచేసే చోట వివిధ రకాలుగా వివక్షను ఎదుర్కోవడం చూస్తూనే ఉంటాం. వ్యక్తిత్వం, రంగూ, ఎత్తూ. ఆకృతి వంటివాటి వల్ల ఈ తరహా ఇబ్బందికి గురికావడమూ చాలామందికి అనుభవమే. అయితే, సిగ్గరులూ, అంతర్ముఖుల విషయంలో ఈ పక్షపాతం రెట్టింపుగా ఉండొచ్చు కూడా. సాధారణంగానే మహిళలు నాయకత్వ స్థానాలకు చేరుకోవడం కష్టం. అందులోనూ అంతర్ముఖులుగా ఉన్నవారికి ఈ తరహా అవకాశాలు మరింత తక్కువ. మీరు ఒకవేళ నాయకత్వాన్ని ఆశిస్తుంటే.. ముందు మీ బలాల్ని గుర్తించి వాటిని నిరంతరం ఉపయోగించుకోవడం మొదలుపెట్టాలి. బోర్డ్‌రూమ్‌ దృష్టిని ఆకర్షించడానికి మీరేమీ మైక్‌ పట్టుకుని కేకలు వేయాల్సిన అవసరం లేదు. మీ ఆలోచనల్ని స్థిరంగా ఉంచుకుని...మీ విలువ తెలిసేలా చేయండి. మీ సంస్థలో మహిళా నాయకురాళ్ల హోదాల్ని గమనించండి. వారాస్థాయికి ఎదిగేందుకు ఏ అంశాలు దోహదం చేశాయో అర్థం చేసుకోండి. ఇంట్రావర్ట్‌లు సెల్ఫ్‌ ప్రమోషన్‌ చేసుకోలేకపోవడం వల్ల చేసే పనికి తగిన గుర్తింపు, ప్రతిఫలం దక్కకపోవచ్చు. బహిర్ముఖుల పరిస్థితి ఇందుకు భిన్నం. వారు త్వరగా పై స్థాయికి చేరగలుగుతారని అధ్యయనాలెన్నో చెబుతున్నాయి. మీరు ఒకవేళ అలా మాట్లాడలేకపోతే...మీ కంపెనీ న్యూస్‌ లెటర్‌, వెబ్‌సైట్‌లో వీటిని రాయొచ్చు. ఇలా మీ విజయాలను హైలైట్‌ చేస్తూ మీ ఆలోచనల్నీ, నాయకత్వ ప్రతిభనూ ప్రదర్శించే కంటెంట్‌ రాయడం వల్ల మీ ఉన్నతికి దారి దొరుకుతుంది. అలా రాసే అవకాశం లేకపోతే లింక్డిన్‌, ఇతర సోషల్‌మీడియా ప్లాట్‌ఫామ్‌లను ఉపయోగించుకోండి. వాటిల్లో మీ వర్క్‌ గురించీ, మీ ప్రత్యేకతల్నీ, మీరు చేసే పనుల వల్ల వచ్చిన అదనపు విలువ, మీకున్న నెట్‌వర్క్‌ తదితర విషయాలను ప్రస్తావించండి. అయితే, ముందు మీ ప్రతికూల అంశాల్ని మార్చుకోగలిగనప్పుడే ఉన్నతి సాధించగలరు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్