బరువు పెరిగా..

నా వయసు 26 సం. హార్మోన్ల అసమతుల్య తతో జుట్టు ఎక్కువగా ఊడిపోతోంది. వైద్యులు బరువు తగ్గాలని సూచించారు. నా ఆహారపుటలవాట్లు ఎలా ఉంటే మంచిది?

Published : 23 Nov 2023 01:41 IST

నా వయసు 26 సం. హార్మోన్ల అసమతుల్య తతో జుట్టు ఎక్కువగా ఊడిపోతోంది. వైద్యులు బరువు తగ్గాలని సూచించారు. నా ఆహారపుటలవాట్లు ఎలా ఉంటే మంచిది?

- ధనలక్ష్మి

హార్మోన్ల అసమతుల్యత ఉన్నవారు జీవనశైలిలో కొన్ని మార్పులు తప్పక చేసుకోవాలి. రోజువారీ ఆహార నియమాలు క్రమం తప్పక పాటించాలి. అల్పాహారం నిద్రలేచిన గంటన్నరలోపే ముగించాలి. రాత్రి భోజనం 8 గంటల లోపు పూర్తి చేయాలి. భోజనంలో బ్రౌన్‌రైస్‌, గోధుమరవ్వ కిచిడీ, జొన్నరొట్టె వంటి వాటిని తీసుకోవాలి. మీరు శాకాహారులైతే మధ్యాహ్న భోజనంలో పప్పు తప్పక ఉండేలా చూసుకోవాలి. నూనె తక్కువేసి వండిన కాయగూరలు,  సోయా,  పనీర్‌ను తీసుకోవచ్చు. మాంసాహారులైతే 75గ్రా. ప్రొటీన్‌ అంటే చికెన్‌, చేపవంటివి గ్రేవీ లేకుండా తీసుకోవాలి. సాయంత్రం స్నాక్స్‌లో శనగలు, పెసలు, బొబ్బర్లు, కీరా, క్యారెట్‌ వంటివి కప్పు తీసుకోవచ్చు. బార్లీ, ఓట్స్‌ను సూప్‌ చేసి తాగినా మంచిదే. రోజుకి 150గ్రా. పండ్ల ముక్కల్ని సాయంత్రం అల్పాహారంగా తీసుకోవచ్చు. బాదం, వాల్‌నట్‌ గుమ్మడి, సన్‌ఫ్లవర్‌ గింజలు మొత్తం 10గ్రా. మించకుండా ఉదయం లేదా సాయంత్రం చిరుతిండిగా తీసుకోవచ్చు. బరువు తగ్గాలంటే శాచురేటెడ్‌ ఫ్యాట్‌ తక్కువ ఉండే ఆహార పదార్థాలు అంటే శుద్ధి చేసిన ఆహార పదార్థాలు, బేకరీఫుడ్స్‌, ప్రాసెస్‌ చేసినవి, మైదా పదార్థాలు,  వేపుళ్లకి పూర్తిగా దూరంగా ఉండాలి. క్రీమ్‌ తక్కువ ఉండే పాలు, వెన్న తీసిన మజ్జిగను తాగొచ్చు. మీరు తీసుకునే ఆహారంలో తీపి, ఉప్పులను తగ్గించాలి. రోజువారీ ఆహారంలో నూనె నాలుగు చెంచాలకు మించకూడదు. దీనితో పాటు 7 నుంచి 8 గంటలు నిద్ర ఉండేలా చూసుకోవాలి. రోజూ కనీసం గంట వ్యాయామం  తప్పనిసరి. అప్పుడు మాత్రమే బరువు తగ్గగలరు. ఈ నియమాలన్నీ మీ ప్రస్తుత బరువుని బట్టి మారుతూ ఉంటాయి. అందువల్ల పోషకాహార నిపుణులను సంప్రదించి వారి సూచనలు పాటిస్తే మంచిది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్