పని చేసినా.. పదోన్నతి లేదు!

ఆర్థిక ఇబ్బందుల కారణంగా డిగ్రీ పూర్తవగానే ఉద్యోగంలో చేరా. కుటుంబ సమస్య తీరింది. త్వరగా పని నేర్చుకొని ఆఫీసులోనూ మంచి పేరు తెచ్చుకున్నా. కీలక ప్రాజెక్టులూ నమ్మి అప్పజెబుతున్నారు.

Published : 29 Nov 2023 01:41 IST

ఆర్థిక ఇబ్బందుల కారణంగా డిగ్రీ పూర్తవగానే ఉద్యోగంలో చేరా. కుటుంబ సమస్య తీరింది. త్వరగా పని నేర్చుకొని ఆఫీసులోనూ మంచి పేరు తెచ్చుకున్నా. కీలక ప్రాజెక్టులూ నమ్మి అప్పజెబుతున్నారు. సమస్యల్లా పదోన్నతి విషయంలోనే! పనిలో నాకంటే వెనకబడి ఉన్నవారికీ కేవలం నాకన్నా పెద్ద చదువులు ఉన్నాయని ప్రమోషన్లు ఇస్తున్నారు. నాకు రాలేదేమంటే విద్యార్హత తక్కువ అంటున్నారు. పని చేసీ నేనిలా ఉండిపోవాల్సిందేనా?

ఓ సోదరి

చాలావరకూ సంస్థల్లో ఇలాంటి పైకి చెప్పని నియమాలు ఉంటాయి. మీరు బాగా పనిచేసినా మీ బాస్‌ దాని గురించి పైవాళ్లకి సరిగా చెప్పలేకపోయినా పదోన్నతి విషయంలో వెనకబడతారు. మీరింకా ప్రారంభ దశలోనే ఉన్నారు కాబట్టి వీటి గురించి తెలియదు. పైస్థాయికి చేరుకోవడానికి ఏమేం కావాలన్న అవగాహనా ఉండదు. దీంతో ఎంత బాగా పనిచేసినా.. ఎంత గొప్ప ఫలితాలు సాధించినా ఈ ‘విద్యార్హత’ లాంటివి అడ్డుగోడలా నిలబడుతూనే ఉంటాయి. అలాగని కుంగిపోనక్కర్లేదు. బాధపడాల్సినంత ఇబ్బందికర పరిస్థితేమీ కాదు మీది. ఇప్పుడెన్నో ఆన్‌లైన్‌ వేదికలు నేర్చుకోవాలన్న తాపత్రయం ఉన్నవారికి అండగా నిలుస్తున్నాయి. వాటి సాయంతో పైచదువులు పూర్తిచేయండి. దూరవిద్యనీ ప్రయత్నించొచ్చు. ఇవన్నీ కుదురుతాయా అని సందేహమొద్దు. ఎంతటి నిపుణులైనా, అనుభవజ్ఞులైనా మారుతున్న కాలానికి తగ్గట్టుగా ‘అప్‌స్కిల్లింగ్‌’పై దృష్టిపెట్టాల్సిందే. కొత్త నైపుణ్యాలను సముపార్జించాల్సిందే. మీ భవిష్యత్తుకు పెట్టుబడిలా భావిస్తే ఇదో ఖర్చులానూ తోచదు. అయితే మీ రంగానికి తగ్గట్టుగా ఏ కోర్సులు చేస్తే మేలో కనుక్కోండి. మెంటార్‌ని ఏర్పరచుకొని వారి సూచనలు కోరండి. నేరుగా మీ బాస్‌నే కలిసి సాయమడిగినా మంచిదే. కాస్త ఓపిక.. మరికాస్త పట్టుదలతో ప్రయత్నించండి.. మీరూ ముందుకెళ్లడం ఖాయం.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్