ఏ కులమని చెప్పాలి...

మాది ప్రేమ వివాహం. మావారు బ్రాహ్మణ కులానికి చెందినవారు. నేను క్రిస్టియన్‌. మాకు ఇద్దరు అమ్మాయిలు. వాళ్లిద్దరికీ స్కూల్లో మా వారి కులం రాస్తే ఎలాంటి రిజర్వేషన్లూ ఉండవు.

Updated : 20 Feb 2024 04:38 IST

మాది ప్రేమ వివాహం. మావారు బ్రాహ్మణ కులానికి చెందినవారు. నేను క్రిస్టియన్‌. మాకు ఇద్దరు అమ్మాయిలు. వాళ్లిద్దరికీ స్కూల్లో మా వారి కులం రాస్తే ఎలాంటి రిజర్వేషన్లూ ఉండవు. నాది రాయొచ్చా? ఇంటర్‌ క్యాస్ట్‌ మ్యారేజ్‌ చేసుకున్నవారి పిల్లలకు అమ్మానాన్నల కులంలో ఎవరిదైనా పెట్టుకునే అవకాశం ఉంటుందా?  

ఓ సోదరి

సాధారణంగా తండ్రి కులాన్నే పిల్లలకు కూడా వర్తింపజేస్తారు. ఇది కులాంతర వివాహాలకూ వర్తిస్తుంది. 2017లో తెలంగాణ హైకోర్టు చిన్నారులు ఎవరి దగ్గర, ఏ సంప్రదాయాలను అనుసరిస్తూ పెరుగుతున్నారో దానికనుగుణంగా కుల ధృవీకరణ పత్రం జారీ చేయాలని తీర్పు ఇచ్చింది. ఇది ముఖ్యంగా వితంతువులూ, విడాకులు తీసుకున్న ఒంటరి మహిళలకు వర్తిస్తుంది. ఈ తీర్పు తరవాత అంటే... 2019లో కేంద్ర సామాజిక న్యాయం, సాధికారతా మంత్రిత్వ శాఖ, రాష్ట్ర ప్రభుత్వాలకు ఈ విషయంలో ఓ నియమావళిని అందించింది. దీని ప్రకారం 2012లో వచ్చిన సుప్రీంకోర్టు తీర్పు, దిల్లీ హైకోర్టు తీర్పు(2019)లను అనుసరించి విడాకులు తీసుకున్న మహిళ తన కుల సంప్రదాయాలకు అనుగుణంగా బిడ్డల్ని పెంచినప్పుడు, వారు తల్లి దగ్గరే పెరిగినప్పుడు ఆమె కులాన్నే వారికి వర్తింపచేయొచ్చు. ఇక, మీ విషయానికి వస్తే మీ దంపతులిద్దరూ కలిసే జీవిస్తున్నారు కాబట్టి మీ భర్త కులమే మీ బిడ్డకీ వర్తిస్తుంది. అలాకాకుండా మీ ఇష్టానుసారం సర్టిఫికెట్‌ తీసుకునే అవకాశం లేదు. మీ పెళ్లికి ముందు తీసుకున్న కులధ్రువీకరణ మీకు జీవితాంతం కొనసాగుతుంది కానీ, మీ పిల్లలకు కాదు. తల్లి కులం కేవలం వివిధ కారణాలతో ఒంటరిగా జీవిస్తోన్న తల్లుల విషయంలో మాత్రమే చెల్లుతుంది.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్