నూనె రాసినా... గడ్డిలాగే!

నా జుట్టు చాలా బరకగా ఉంటుంది. ఎంత నూనె పెట్టినా ప్రయోజనం లేదు. గడ్డిలా... చూడటానికి అసహ్యంగా కనిపిస్తోంది.. సమస్యేంటి? మార్చుకునే మార్గం చెప్పండి.

Updated : 25 Feb 2024 05:11 IST

నా జుట్టు చాలా బరకగా ఉంటుంది. ఎంత నూనె పెట్టినా ప్రయోజనం లేదు. గడ్డిలా... చూడటానికి అసహ్యంగా కనిపిస్తోంది.. సమస్యేంటి? మార్చుకునే మార్గం చెప్పండి.

ఓ సోదరి

ర్మంపై సహజంగానే నూనె గ్రంథులు ఉంటాయి. మాడుపై ఉన్నవి తగినంత నూనెల్ని విడుదల చేయనప్పుడు జుట్టు ఇలా బరకగా, గడ్డిలా తయారవుతుంది. మీ వయసెంతో చెప్పలేదు. వయసు పెరిగేకొద్దీ చర్మంలో నూనెల విడుదల తగ్గుతుంది. ఇంకా... మెనోపాజ్‌, హార్మోనుల్లో అసమతుల్యత, హైపోథైరాయిడిజం వంటివీ కారణమవొచ్చు. తరచూ తలస్నానాలు చేయడం, డ్రయ్యర్లతో జుట్టును ఆరబెట్టడం, ఐరనింగ్‌, స్ట్రెయిట్‌నర్లు, ఆల్కహాల్‌ ఆధారిత స్టైలింగ్‌ ఉత్పత్తులు అతిగా వాడినా ఈ సమస్య ఎదురవుతుంది. అంతెందుకు... అతిగా ఎండలో తిరగడం, వాహనాలపై ప్రయాణిస్తూ జుట్టును వదిలేసినా కూడా ఇలా కురులు పొడిబారతాయి. మీ సమస్యకు కారణమేంటో కనుక్కోండి. అనారోగ్యమైతే సంబంధిత మందులు వాడాలి. ఇంకా కొన్ని జాగ్రత్తలు పాటిస్తే సరిపోతుంది. తలస్నానం వారానికి మూడుసార్లకు మించొద్దు. రసాయనాల్లేని ముఖ్యంగా సల్ఫేట్లు, సిలికాన్‌ లేనివి, పీహెచ్‌ 5.5 ఉన్న షాంపూలకే ప్రాధాన్యమివ్వండి. హెయిర్‌ స్టైలింగ్‌ ఉత్పత్తులు వాడాల్సొస్తే ఆల్కహాల్‌ లేని రకాలను ఎంచుకోవాలి. వేడుకల కోసం ఉపయోగించినా వెంటనే తలస్నానం తప్పక చేయాలి. కండిషనర్‌ వాడుతూ, వారానికి రెండుసార్లు అరటిపండు, పెరుగు, తేనె వంటివి కలిపి హెయిర్‌ ప్యాక్‌లు వేసుకోండి. ఇంకా కొబ్బరి, జొజొబా, బాదం నూనెల్లో నచ్చిన దాన్ని గోరువెచ్చగా చేసుకొని, తలకు పట్టించాలి. మృదువుగా మర్దనా చేసి, రాత్రంతా వదిలేయాలి. మరుసటిరోజు తలస్నానం చేయడం అలవాటుగా చేసుకోండి. ఈ జాగ్రత్తలతో సమస్య అదుపులోకి వస్తుంది.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్