బరువు తగ్గాలి...

నా వయసు 42 సం. ఎత్తు 5.5. బరువు వంద కేజీలు. తక్కువ కెలొరీలు తీసుకుంటూ బరువు తగ్గాలనుకుంటున్నాను.

Published : 29 Feb 2024 01:58 IST

నా వయసు 42 సం. ఎత్తు 5.5. బరువు వంద కేజీలు. తక్కువ కెలొరీలు తీసుకుంటూ బరువు తగ్గాలనుకుంటున్నాను.

ఓ సోదరి, రాజమహేంద్రవరం

మీ ఎత్తుకు సుమారుగా 65 కిలోలు మాత్రమే ఉండాలి. మొదట మీ బరువుపై పదిశాతం అంటే పదికేజీలు తగ్గాలి. నెమ్మదిగా ఆ సంఖ్య పెంచుకోవాలి. ఇది ఆరోగ్యంగా బరువు తగ్గే పద్ధతి. బరువు తగ్గాలంటే ముఖ్యంగా తీసుకునే కెలొరీలు, ఖర్చుచేసే కెలొరీల కన్నా తక్కువ ఉండాలి. దీంతోపాటు ఆహార నియమాలు పాటిస్తూ, వ్యాయామాలు చేయాలి. ఇవి వయసును బట్టి ఎంత సమయం చేయాలనేది ఉంటుంది. రోజూ 45 నిమిషాల నుంచి గంట వరకూ క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలి. అలాగే ఆహారం మోతాదు మించకూడదు. ఇంకో విషయం... మీరు తినే ఆహారంలో శాచ్యురేటెడ్‌ ఫ్యాట్‌ ఉండే నూనెలు.. ఎక్కువ కొవ్వులు, వెన్న, నెయ్యి, మయోనైజ్‌, వనస్పతి వంటి వాటికి దూరంగా ఉండాలి. ప్రస్తుతం ఉన్న బరువును బట్టి రోజుకి 20 ఎంఎల్‌ ఆయిల్‌ను మాత్రమే వాడాల్సి ఉంటుంది. తీపి పదార్థాలకు దూరంగా ఉండాలి. డయాబెటిస్‌ లేకపోతే తీసుకునే ఆహార పదార్థాల్లో చ·క్కెర రెండు చెంచాలకు మించరాదు. అంటే.. బెల్లం, తేనె, షుగర్‌ ఏదైనా కావచ్చు. వీటితో పాటు చాక్లెట్స్‌, మైదా పదార్థాలు, బయట ఆహారాలకు దూరంగా ఉండాలి. మీ వయసును బట్టి కాల్షియం, ప్రొటీన్‌ ఉండే ఆహారపదార్థాలు తీసుకోవాలి. రోజువారీ ఆహారంలో పండ్లు, కూరగాయలను భాగం చేసుకోవాలి. శాకాహారులైతే పప్పుదినుసులు, సోయా నుంచి కావల్సినంత ప్రొటీన్‌ లభిస్తుంది. మాంసాహారులైతే లీన్‌మీట్‌ అంటే.. చికెన్‌, గుడ్డు, చేప ద్వారా లభిస్తుంది. చిరుతిండిగా.. మిల్లెట్స్‌తో జావ లేదా సలాడ్‌ తీసుకోవాలి. మొలకలు.. అంటే శనగలు, పెసలు, బొబ్బర్లు, వంటి వాటిని స్నాక్స్‌గా తీసుకోవచ్చు. ఇవన్నీ తగిన పరిమాణంలో, సమయానుగుణంగా తీసుకోవాలి.. వీలైనంత వరకూ పోషకాహార నిపుణులను సంప్రదించి వారి సూచనల మేరకు పాటించడం మేలు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్