కొద్దిరోజుల్లో పెళ్లి... ఇప్పుడెలా?

కొద్దిరోజుల్లో నా పెళ్లి ఉంది. తీరా చూస్తే ఇప్పుడు మొటిమలు మొదలయ్యాయి. ఒకటీ రెండూ కాదు నుదురు, బుగ్గల మీద చాలా వచ్చేశాయి. త్వరగా తగ్గే మార్గం ఏదైనా ఉంటే చెప్పండి.

Updated : 10 Mar 2024 04:12 IST

కొద్దిరోజుల్లో నా పెళ్లి ఉంది. తీరా చూస్తే ఇప్పుడు మొటిమలు మొదలయ్యాయి. ఒకటీ రెండూ కాదు నుదురు, బుగ్గల మీద చాలా వచ్చేశాయి. త్వరగా తగ్గే మార్గం ఏదైనా ఉంటే చెప్పండి.

ఓ సోదరి

యాక్నే ఎప్పుడూ నెమ్మదిగా రావు. ఒక్కసారిగానే వచ్చేస్తాయి. కొన్ని ఎర్రగా, మరికొన్ని చీముతో కూడి ఉంటాయి. ఇవి భుజాలు, మెడపైనా వస్తాయి. మృతకణాలు చర్మరంధ్రాల్లో పేరుకోవడం, సహజ నూనెలు అతిగా విడుదల అవ్వడం, హార్మోనుల్లో మార్పులు, ఒత్తిడి వల్ల కూడా వస్తుంటాయి. మీ విషయంలో వాతావరణం ఒక్కసారిగా మారడం, బయట ఎక్కువగా తిరగడం, పెరిగిన ఒత్తిడి... యాక్నేకి కారణమై ఉండొచ్చు. పీరియడ్స్‌ రాకుండా ఏమైనా మందులు వాడారా? అవీ కారణమే! క్లిండమైసిన్‌, నికోటినమైడ్‌, బెంజైల్‌ పెరాక్సైడ్‌, రెటినాయిడ్స్‌ ఉన్న టాపికల్‌ క్రీములు వాడటం ప్రారంభించండి. సాల్సిలిక్‌ యాసిడ్‌ ఉన్న ఫేస్‌వాష్‌లు ఉపయోగించండి. మరీ ఎక్కువగా ఉందన్నారు కాబట్టి, ఓరల్‌ యాంటీబయాటిక్స్‌నీ వాడాలి. వీటన్నింటితో సమస్య దాదాపు అదుపులోకి వస్తుంది. వీటికీ తగ్గకపోతే లైట్‌, లేజర్‌ థెరపీలు, కెమికల్‌ పీల్స్‌ చేయించుకోవాలి. ఇవి ఎరుపుదనం, ఉబ్బు వంటివి తగ్గిస్తాయి. అయితే మల్టిపుల్‌ సిట్టింగ్స్‌ అవసరమవుతాయి. పెళ్లంటే మేకప్‌ తప్పనిసరి. అలాంటప్పుడూ జాగ్రత్త. నాన్‌కమడోజెనిక్‌ రకాలకే ప్రాధాన్యం ఇవ్వండి. వాడే బ్రష్‌లు శుభ్రంగా ఉన్నాయో లేదో చెక్‌ చేసుకోవడం, మేకప్‌ తొలగించడంలో తగిన జాగ్రత్తలు పాటిస్తే, తిరిగి సమస్యగా మారకుండా ఉంటాయి.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్