అమ్మ ఆస్తి... ఆవిడకు రాసిచ్చారు

నాన్న ఇరవై ఏళ్లుగా ఒకావిడతో సహజీవనం చేస్తున్న విషయం ఈ మధ్యే మాకు తెలిసింది. దాంతో అమ్మ విడాకులు కావాలంటోంది. అయితే, నాన్న ఇప్పటికే చాలా ఆస్తుల్ని ఆ మహిళ, ఆమె కూతురు పేరున రాశాడట. అవన్నీ ఆయనే కొన్నా...

Published : 19 Mar 2024 01:13 IST

నాన్న ఇరవై ఏళ్లుగా ఒకావిడతో సహజీవనం చేస్తున్న విషయం ఈ మధ్యే మాకు తెలిసింది. దాంతో అమ్మ విడాకులు కావాలంటోంది. అయితే, నాన్న ఇప్పటికే చాలా ఆస్తుల్ని ఆ మహిళ, ఆమె కూతురు పేరున రాశాడట. అవన్నీ ఆయనే కొన్నా... అమ్మ తెచ్చుకున్న పొలం నుంచి వచ్చిన ఆదాయం, తన నగల్ని తాకట్టు పెట్టి తెచ్చిన రుణాలతో వ్యాపారాన్ని వృద్ధి చేసి కొన్నవే. వాటిని ఆవిడ దగ్గర నుంచి వెనక్కి తీసుకునే అవకాశం ఉందా? సలహా ఇవ్వగలరు?

ఓ సోదరి.

మీ లేఖ ద్వారా మీ అమ్మగారికి జరిగిన అన్యాయం అర్థమవుతోంది. మహిళ పుట్టింటి నుంచి తెచ్చుకున్న స్త్రీధనం ఆవిడ సొంతం. దానిపై మీ నాన్నకు ఎటువంటి హక్కూ లేదు. ఆయన తన స్వార్జితపు ఆస్తిని ఎవరికైనా ఇచ్చుకోవచ్చు. కానీ, అది మీ తల్లి ఆస్తిని అభివృద్ధి చేయగా వచ్చిన ఆదాయంతో కొన్నదని చెబుతున్నారు. అలాంటిది ఏమైనా ఉంటే... అది వారిద్దరికీ జాయింట్‌ ప్రాపర్టీ అవుతుంది. దాన్ని తనకు నచ్చినట్లు ఎవరికైనా రాసిచ్చే హక్కు ఆయనకు లేదు. విడాకుల దావా వేసినప్పుడే మీ అమ్మగారు... తన బంగారం, పొలం, ఇతరత్రా ఆస్తులన్నింటినీ తిరిగి ఇవ్వమని మరో పిటిషన్‌ కూడా వేయొచ్చు. ముందు మీ నాన్న సహజీవనం చేస్తోన్న ఆవిడ పేరున రాసిన ఆస్తి కాగితాలు సంపాదించి వాటి క్యాన్సిలేషన్‌ కోసం కోర్టులో వేరుగా మరో దావా వేయండి. మీ తాతయ్య తన కూతురు పేరున రాసిన ఆస్తి కాగితాలూ వాటిని అమ్మి లేదా రుణం తీసుకుని... మీ నాన్న కొన్న ప్రాపర్టీ డాక్యుమెంట్లూ, అమ్మ నగలకు సంబంధించిన ఫొటోలు దగ్గర పెట్టుకోండి. ఇవన్నీ మీకు కోర్టులో డాక్యుమెంటరీ ప్రూఫ్‌గా పనికి వస్తాయి. వాటన్నింటితో మీ నాన్న ఆస్తిని, వ్యాపారాన్ని ఎలా వృద్ధి చేశారో నిరూపించగలగాలి. ముందు మంచి లాయర్‌ని సంప్రదించి... మళ్లీ ఆస్తి మీ చేతులు మారకముందే వెనక్కి తెచ్చుకునే ప్రయత్నం చేయండి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్