ఉద్యోగం మానేయాలట!

మావారు ప్రభుత్వోద్యోగి. కానీ నాకంటే తక్కువ చదువుకున్నారు. కుటుంబ ఆర్థిక పరిస్థితి బాలేకపోవడంతో ఒప్పించి మరీ నాకీ పెళ్లి చేశారు. నేనూ ఉద్యోగం చేస్తున్నా.

Published : 20 Mar 2024 01:47 IST

మావారు ప్రభుత్వోద్యోగి. కానీ నాకంటే తక్కువ చదువుకున్నారు. కుటుంబ ఆర్థిక పరిస్థితి బాలేకపోవడంతో ఒప్పించి మరీ నాకీ పెళ్లి చేశారు. నేనూ ఉద్యోగం చేస్తున్నా. అది ఆయనకు నచ్చడం లేదు. పైగా ‘నాకంటే ఎక్కువ చదివా అని చెప్పడానికా ఉద్యోగం చేస్తానంటున్నావ్‌. నేను సంపాదిస్తున్నా చాలు. నువ్వు మానేయ్‌’ అంటూ ఒత్తిడి తెస్తున్నారు. నాకేమో చదివిన చదువుకో ప్రయోజనం ఉండాలని. అదే చెబితే తరచూ గొడవలు. అసలే బాండ్‌ ఉంది. మానేస్తే పెద్ద మొత్తంలో డబ్బులు కట్టాలి. పోనీ పైవాళ్లకు నా పరిస్థితి చెబితే అర్థం చేసుకుంటారా?

 ఓ సోదరి

బయటికెళ్లి ఉద్యోగం చేయడం మనకు సవాలే. ఇక ఇంటి నుంచీ ప్రోత్సాహం కరవైతే అది మరింత కఠినంగా మారుతుంది. పైవాళ్లు కాదు, ఇంట్లోనే పరిష్కరించుకోవాల్సిన సమస్య ఇది. అసలు మీవారికి మీరు పనిచేయడం ఎందుకు నచ్చడం లేదు? చాలామందికి భార్యలు సంపాదిస్తే లెక్క చేయరన్న భయం ఉంటుంది. కొన్నిసార్లు కుటుంబాన్ని నిర్లక్ష్యం చేస్తున్నారనో, తమకు తగినంత ప్రాధాన్యం, సమయం ఇవ్వడం లేదనో కూడా వ్యతిరేకిస్తుంటారు. ఇద్దరి పనివేళలు వేరే అవ్వడం, అసలు భార్య సంపాదనతో బతకడమేంటన్న అహం కూడా కారణమవ్వొచ్చు. ముందు మీవారి వ్యతిరేకతకు కారణం తెలుసుకోండి. దాని ప్రకారం వారిలో మార్పునకు ప్రయత్నించండి. అయితే అరిచి, గోలపెట్టి సాధిస్తే మీ బంధానికే ముప్పు. గొడవలు, బెదిరింపులతో సాధించాలనీ అనుకోవద్దు. అలాగని కెరియర్‌నీ పక్కన పెట్టక్కర్లేదు. మీ లక్ష్యాలు మీకెంత ముఖ్యమో చెబుతూనే అవతలివాళ్ల భయాల్నీ పరిగణనలోకి తీసుకుంటానన్న నమ్మకాన్ని ఇవ్వండి. ఎక్కడెక్కడ సర్దుబాట్లు చేసుకోగలరో కూడా ఆలోచించుకొని చెప్పండి. ఒక్కసారికే నిర్ణయం తీసుకోవడం అవ్వదు కూడా. అందుకే చాలా ఓపికగా మళ్లీ మళ్లీ ప్రయత్నించాలి. చూడటానికి పెద్ద సమస్యగా కనిపిస్తుంది కానీ... కాస్త వ్యూహాత్మకంగా, పట్టుదలగా ప్రయత్నిస్తే పరిష్కారం సాధ్యమే!

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్