చేతులపై ఏమిటీ మచ్చలు?

కొన్నిరోజులుగా చేతుల మీద నల్లగా, కాలినట్లుగా మచ్చలు వస్తున్నాయి. చిన్నగా మొదలై బఠాణీ గింజంత పెద్దగా అవుతున్నాయి. ఏమిటీ సమస్య? ఎందుకలా వస్తున్నాయి?

Updated : 24 Mar 2024 04:31 IST

కొన్నిరోజులుగా చేతుల మీద నల్లగా, కాలినట్లుగా మచ్చలు వస్తున్నాయి. చిన్నగా మొదలై బఠాణీ గింజంత పెద్దగా అవుతున్నాయి. ఏమిటీ సమస్య? ఎందుకలా వస్తున్నాయి?

సాధారణ సమస్యే. కొన్నిరోజులు, వారాల్లో వాటంతటవే తగ్గిపోతాయి. కొందరిలో ఎర్రగా, ఉబ్బి కూడా కనిపిస్తాయి. దురద వంటివీ ఉంటాయి. ఒక్కసారిగా వాతావరణంలో మార్పులు, ఒత్తిడి, ఎండలో ఎక్కువగా ఉండేవారిలో కనిపిస్తాయి. పెట్స్‌ పెంచుతున్నా, కొన్నిరకాల నట్స్‌ పడకపోయినా, యాంటీ బయాటిక్స్‌ వాడుతున్నా వస్తాయి. అంతెందుకు, ఎక్కువగా వేడినీటి స్నానాలు చేసేవారు, అతివ్యాయామం, కొత్త ఉత్పత్తుల్లోని రసాయనాలు పడకపోయినా ఈ మచ్చలు వచ్చేస్తుంటాయి. కొందరికి వెంటనే ప్రభావం చూపితే, ఇంకొందరికి కొంత కాలానికి నెమ్మదిగా బయటపడతాయి. మీ సమస్యకు ఏవి కారణం అవుతున్నాయో గమనించుకోండి. మీది పొడిచర్మమా? దురద అనిపించి, తెలియకుండా రుద్దినా సమస్యే. కాబట్టి, రోజుకు రెండుసార్లు మాయిశ్చరైజర్‌ తప్పక రాయండి. వైద్యుల సలహాతో కొన్ని మందులూ వాడాలి. సమస్య దీర్ఘకాలం ఉంటే ఇంజెక్షన్లూ తీసుకోవాలి. ఇంకా గోరువెచ్చని నీటితోనే స్నానం చేయండి. వీలున్నప్పుడల్లా చల్లని నీటిలో ముంచి తీసిన వస్త్రంతో తుడిచి, కొల్లాయిడల్‌ ఓట్‌మీల్‌ ఉండే మాయిశ్చరైజర్‌ రాస్తే సరి. దురద ఉంటే సంబంధిత క్రీములూ తప్పనిసరి. ఇంకా... స్పూను చొప్పున వెనిగర్‌, గోరువెచ్చని నీరు తీసుకొని, ఆ మిశ్రమంలో ముంచిన దూదితో సమస్య ఉన్నచోట అద్దాలి. పావు కప్పు బ్రౌన్‌ షుగర్‌కి ముప్పావుకప్పు వెనిగర్‌, చెంచా తురిమిన అల్లాన్ని కలిపి వేడిచేయాలి. చల్లార్చి ఆ మిశ్రమాన్ని మచ్చలపై రాసినా సమస్య అదుపులోకి వస్తుంది.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్