వ్యాయామం లేకుండా తగ్గొచ్చా...

మా అమ్మ వయసు 55. ఈ మధ్య బరువు బాగా పెరుగుతోంది. పైగా మోకాళ్ల నొప్పులు. దీంతో ఎక్కువ దూరం నడవలేకపోతుంది. వ్యాయామం లేకుండా కేవలం ఆహార నియమాలతో బరువు తగ్గే మార్గం ఉంటే చెప్పగలరు.

Published : 28 Mar 2024 02:01 IST

మా అమ్మ వయసు 55. ఈ మధ్య బరువు బాగా పెరుగుతోంది. పైగా మోకాళ్ల నొప్పులు. దీంతో ఎక్కువ దూరం నడవలేకపోతుంది. వ్యాయామం లేకుండా కేవలం ఆహార నియమాలతో బరువు తగ్గే మార్గం ఉంటే చెప్పగలరు.

స్వప్న, కడప

ఈ వయసులో శరీరంలో హార్మోన్ల అసమతుల్యత, రుతుక్రమంలో తేడాలు ఇలా కొన్ని రకాల మార్పులు కనిపిస్తుంటాయి. దీంతో తక్కువ తిన్నా బరువు పెరుగుతారు. వ్యాయామం చేయలేని పరిస్థితి వచ్చినప్పుడు కేవలం ఆహార నియమాలతోనూ బరువు తగ్గే అవకాశం ఉంటుంది. మీ అమ్మగారు కాస్త కఠినమైన ఆహార పద్ధతులకు అలవాటు పడగలరో లేదో ముందు తెలుసుకోండి. ముఖ్యంగా ఆమె తీసుకునే ఆహారంలో సూక్ష్మపోషకాలు, పీచు, మాంసకృత్తులు ఉండేలా చూసుకోవాలి. ఒకపూట పొట్టు పప్పుతో చేసిన అల్పాహారం అందించాలి. చిరుధాన్యాల (అరికెలు, సామలు, కొర్రలు)తో వండిన 60గ్రాముల అన్నం, 200గ్రాముల కాయగూరలు మధ్యాహ్న భోజనంలో ఇవ్వండి. సాయంత్రం రాగిజావ, పండ్లు వంటివి స్నాక్స్‌గా తీసుకున్నా చాలు. ఇక రాత్రి భోజనానికి మల్టీగ్రెయిన్‌ పిండితో చేసే చపాతీలను ఆకుకూరలతో కలిపి తీసుకోవాలి. ముందు ఆవిడ ఎత్తు, బరువును బట్టి ఏ పదార్థాలు ఎంత మోతాదులో తీసుకోవచ్చో తెలుసుకోండి. ప్రస్తుతం ఆమె ఉన్న బరువులో 10శాతం తగ్గినా మోకాళ్ల నొప్పిలో మార్పు కనిపిస్తుంది. ఆవిడ ఆరోగ్య పరిస్థితిని బట్టి పోషకాహార నిపుణులను సంప్రదిస్తే మంచిది.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్