పారిపోయి వచ్చేశా... అతడికి శిక్ష పడదా!

ఎన్‌ఆర్‌ఐతో పెళ్లయ్యింది. ఆరు రోజులకే అమెరికా తీసుకెళ్లాడు. ఆపై ఆర్నెల్లు తిరిగేసరికి... పల్లెటూరు దాన్ననీ, నేను అక్కడ ఉండటానికి పనికిరాననీ హింసించడం మొదలుపెట్టాడు.

Published : 02 Apr 2024 01:57 IST

ఎన్‌ఆర్‌ఐతో పెళ్లయ్యింది. ఆరు రోజులకే అమెరికా తీసుకెళ్లాడు. ఆపై ఆర్నెల్లు తిరిగేసరికి... పల్లెటూరు దాన్ననీ, నేను అక్కడ ఉండటానికి పనికిరాననీ హింసించడం మొదలుపెట్టాడు. ఎవరికీ ఫోన్‌ చేయనిచ్చేవాడు కాదు. ఇంట్లో ఒంటరిగా వదిలి తాళం వేసి  విహారయాత్రలకు వెళ్లొచ్చేవాడు. ఓ పొరుగింటి భారతీయ కుటుంబం సాయంతో ఈ ఇబ్బందుల నుంచి బయటపడి మా ఇంటికి చేరుకున్నా. అయితే, నాకు విడాకులు ఇవ్వలేదు కానీ ఇప్పుడక్కడ మరోపెళ్లి చేసుకుంటున్నాడట. అతడికి శిక్ష పడే మార్గం లేదా? నేను అతడి నుంచి పరిహారం కోరవచ్చా?

 ఓ సోదరి

ఈ మధ్య ఎన్‌ఆర్‌ఐ వివాహాల్లో ఇలాంటి సంఘటనలు తరచూ చూస్తున్నాం. కట్నం కోసం పెళ్లి చేసుకోవడం, అక్కడికి వెళ్లాక బాధలు పెట్టడం, తిరిగి ఇండియాకు పంపించేయడం, విడాకుల కేసు వేసి తప్పుడు చిరునామాలతో డివోర్స్‌ తీసుకోవడం, ఆపై మరో వివాహానికి సిద్ధపడటం వంటివెన్నో చూస్తున్నాం. ఇక, కొంతమంది చేస్తోన్న ఉద్యోగం, వస్తోన్న జీతం, ఇమ్మిగ్రేషన్‌ స్టేటస్‌...వంటి విషయాల్లో తప్పుడు సమాచారం ఇచ్చి మోసం చేస్తున్నారు. మీ భర్త విషయానికి వస్తే... అతనక్కడ వేరే పెళ్లి ఎలా చేసుకుంటున్నాడో తెలియదు. భారతీయ చట్టాల ప్రకారం పెళ్లి జరిగినప్పుడు విడాకులు తీసుకోకుండా రెండో పెళ్లి చేసుకోవడానికి వీలు లేదు. అందుకు సంబంధించిన సరైన సమాచారముంటే పాస్‌పోర్టు అధికారులకు, ఇండియన్‌ ఎంబసీకి ఫిర్యాదు చేయండి. ఇక్కడ క్రిమినల్‌ కేసు ఫైల్‌ చేసి అతడి పాస్‌పోర్టు సీజ్‌ చేయమని కోరవచ్చు. జాతీయ మహిళా కమిషన్‌కి ఫిర్యాదు చేయొచ్చు. ఆన్‌లైన్‌ ద్వారానూ దీన్ని పంపించొచ్చు. ఇక, మీ భర్త మీకు చేసిన అన్యాయానికి అతడి నుంచి నష్ట పరిహారం కోరవచ్చు కూడా. అయితే, ముందు అతడి రెండో పెళ్లిని ఆపడానికి పోలీసు వారి సాయం కోరండి. వారు ఎటువంటి చర్య తీసుకోకపోతే కోర్టులో ప్రైవేట్‌ కంప్లైంట్‌ ముందు ఓ మంచి లాయర్‌ని సంప్రదించండి.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్