వేసవిలోనూ ఏంటిలా?

మామూలుగా చలికాలంలో పాదాలు పగులుతాయి కదా! నాకేమో వేసవిలో ఈ సమస్య చాలా ఎక్కువ. దీనికితోడు విపరీతమైన మంట. పరిష్కారం చెప్పండి.

Published : 07 Apr 2024 01:46 IST

మామూలుగా చలికాలంలో పాదాలు పగులుతాయి కదా! నాకేమో వేసవిలో ఈ సమస్య చాలా ఎక్కువ. దీనికితోడు విపరీతమైన మంట. పరిష్కారం చెప్పండి.

ఓ సోదరి

దీన్ని క్రాక్‌డ్‌ ఫుట్‌, క్రాక్‌డ్‌ హీల్స్‌ అంటాం. చలి, వర్షాకాలాల్లో ఈ సమస్య ఎక్కువగా ఉంటుంది. కానీ పొడి చర్మం వారిలో కొద్దిమందికి మీలా వేసవిలోనూ ఈ ఇబ్బంది ఉంటుంది. ఎక్కువసేపు నిలబడి పనిచేసేవారు, గట్టి నేలమీద నడిచేవారు, ఒబెసిటీ, డయాబెటిస్‌, హైపోథైరాయిడిజం ఉన్నవారు, బిగుతైన చెప్పులు, షూ వేసుకునేవారిలోనూ కనిపిస్తుంది. వీరికి పాదాల దగ్గర చర్మం మందంగా మారుతుంది. దీనికితోడు శరీరం బరువు, ఒత్తిడి పడి చర్మం సాగినట్లుగా అవుతుంది. దానిలో తగినంత తేమ లేకపోతే ఇలా పగుళ్లు ఏర్పడతాయి. ముందు నీళ్లలో పాదాలు ఎక్కువగా తడపడం, వేడి నుంచి తట్టుకోవడానికని పదే పదే స్నానాలు, అది కూడా ఎక్కువసేపు చేయడం, రసాయనాలున్న సబ్బులను వాడటం వంటివి ఆపాలి. అలాగే ఆల్కహాల్‌, పరిమళాలు ఉండే సబ్బులనూ వాడొద్దు. స్నానమయ్యాక పాదాలను మృదువైన వస్త్రంతో తుడిచి మాయిశ్చరైజర్‌ రాయడం అలవాటుగా చేసుకోండి. అధిక తేమనిచ్చే ఆయిల్‌, షియాబటర్‌, గ్లిజరిన్‌, లెనోలిన్‌, లాక్టిక్‌ యాసిడ్‌ ఉండే క్రీములను ఎంచుకుంటే మేలు. ఇంకా వెనక భాగాన్ని కప్పుతూ ఉండే షూనే వాడండి. ఎక్కువసేపు నిల్చొని ఉండాల్సొస్తే ప్యాడెడ్‌ సాక్సులు వేసుకోవాలి. రాత్రుళ్లు పడుకునే ముందు పెట్రోలియం జెల్లీ లేదా కెరటోలైటిక్‌ క్రీములు రాసి కాటన్‌ సాక్సులు వేయాలి. ఉదయాన్నే పాదాలను కాస్త తడిచేసి, ప్యుమిక్‌ స్టోన్‌తో మృదువుగా రుద్దితే మృతకణాలు పోతాయి. తరవాత  పాదాలను శుభ్రంగా తుడిచి, మాయిశ్చరైజర్‌ రాయాలి. మంట, నొప్పి, రక్తం వంటివీ కనిపిస్తే యాంటీ బయాటిక్‌ క్రీములనూ వాడాలి. ఇలా తరచూ చేస్తోంటే సమస్య తగ్గుతుంది.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్