విడిపోయాం.. ముందుకెళ్లేదెలా?

నాకు పెళ్లయి నాలుగేళ్లు అవుతుంది. ఇన్నాళ్ల తరవాత ఆయన సాధించాల్సినవి చాలా ఉన్నాయనీ, ఇక ఈ బంధంలో కొనసాగలేనని నా నుంచి విడిపోయారు. జీవితంలో నేను ఎలా ముందుకెళ్లాలో తెలియడం లేదు. సలహా ఇవ్వగలరు.

Published : 15 Apr 2024 03:42 IST

నాకు పెళ్లయి నాలుగేళ్లు అవుతుంది. ఇన్నాళ్ల తరవాత ఆయన సాధించాల్సినవి చాలా ఉన్నాయనీ, ఇక ఈ బంధంలో కొనసాగలేనని నా నుంచి విడిపోయారు. జీవితంలో నేను ఎలా ముందుకెళ్లాలో తెలియడం లేదు. సలహా ఇవ్వగలరు.

ఓ సోదరి

వివాహం అంటే రెండు మనసుల కలయిక. ఏ ఒక్కరు దానికి కట్టుబడి ఉండకపోయినా ఆ బంధం ముందుకు సాగదు. అతను ఏ లక్ష్యం కోసం విడాకులు తీసుకున్నాడో తెలియడం లేదు. ఏది ఏమైనా మీకు నష్టం జరిగింది. కాబట్టి కోర్టు ద్వారా మీకు మనోవర్తి లాంటిదేమైనా వస్తుందేమో చూడండి. ఉద్యోగం చేస్తుంటే అది రాకపోవచ్చు. గతంలో ఏమైనా ఇస్తానని మీకు మాట ఇచ్చి ఉంటే, అవి దక్కేలా చూసుకోండి. మరో ముఖ్య విషయం ఏంటంటే... మీరు ఆయన్ని విడాకులు కోరలేదు. తనే వద్దనుకొని వెళ్లిపోయాడు కాబట్టి మీరు ఏదో పోగొట్టుకున్నానని బాధ పడాల్సిన అవసరం లేదు. ఒకవేళ మీరు ఉద్యోగం చేయనట్లయితే, ముందు మీకు నచ్చిన ఓ కొలువు వెతుక్కోండి. మీ కాళ్ల మీద మీరు నిలబడితే మీలో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. జీవితంలో అనుకోని సంఘటనలు జరిగినప్పుడే మనం మరింత ధైర్యంగా ఉండాలి. అతను ఎలా అయితే జీవితంలో ఏదో సాధించాలని విడిపోయాడో అదే విధంగా మీరూ ఏమీ తక్కువ కాదని నిరూపించండి.  అలానే, ఇప్పుడు మీకెదురైన ఇబ్బందులే భవిష్యత్తులోనూ వస్తాయని అనుకోవద్దు. మిమ్మల్ని ఇష్టపడేవారు, అర్థంచేసుకుని ప్రోత్సహించేవారు దొరికితే మళ్లీ పెళ్లి చేసుకోవడానికి సంకోచించకండి. ముందు ధైర్యంగా ఉండండి. మీకంటూ ఒక లక్ష్యాన్ని ఏర్పరచుకుని ముందుకు సాగండి. అవసరమైతే అందుకు మీ కుటుంబ సభ్యులు, స్నేహితుల సహాయాన్ని తీసుకోవడానికీ వెనుకాడొద్దు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్