పిల్లలకి పెద్దవాళ్లవి... పర్లేదా?

పాప వయసు ఏడాదిన్నర. ఇప్పటివరకూ బేబీ సోపునే వాడాం. ఇక నుంచి పెద్దవాళ్లు వాడే వాటిని ఉపయోగించాలనుకుంటున్నాం. పర్లేదా?

Updated : 28 Apr 2024 06:53 IST

పాప వయసు ఏడాదిన్నర. ఇప్పటివరకూ బేబీ సోపునే వాడాం. ఇక నుంచి పెద్దవాళ్లు వాడే వాటిని ఉపయోగించాలనుకుంటున్నాం. పర్లేదా?

ఓ సోదరి

ఏడాదిలోపు పిల్లలకు వాడే ఉత్పత్తులను జాగ్రత్తగా ఎంచుకోమని చెబుతారు. వాళ్ల చర్మం చాలా సున్నితంగా ఉంటుంది. అందుకే గాఢత తక్కువగా ఉండే  ఉత్పత్తులనే ఎంచుకోమంటారు. తాజా పరిశోధన ప్రకారం ఏడాదిలోపు వాళ్లకి సబ్బును వీలైనంత తక్కువ వాడాలి. వాళ్ల చర్మం పొడిబారి చర్మసమస్యలకు దారితీయడమే అందుకు కారణం. మీ పాపకి ఏడాదిన్నర అంటున్నారు. కాబట్టి, పర్లేదు అనుకోవద్దు. చాలామంది ఫ్యాన్సీ, రంగులు, పరిమళాలు ఉన్న సబ్బులను ఇష్టపడుతుంటారు. అవి పిల్లలకే కాదు, మీకూ అంత మంచిది కాదు. వీటిలో దుర్వాసన తగ్గాలనీ, మరికొన్ని చర్మ ప్రయోజనాల కోసం రసాయనాలు వాడతారు. ఇవి చర్మంలో సహజ నూనెలను తగ్గించి, దురదకు దారితీస్తాయి. ఇలాంటివి పిల్లలకు అసలే పడవు. వాళ్లకి చాలా మైల్డ్‌ ఉత్పత్తులు వాడాలి. అందుకే సబ్బులు కాకుండా కొబ్బరి, బాదం లాంటి సహజ నూనెలు, అలోవెరా ఉండే బాడీవాష్‌లకి ప్రాధాన్యమివ్వండి. వాటిల్లోనూ పరిమళాలు లేకుండా చూసుకోవాలి. వాళ్ల చర్మం మనతో పోలిస్తే ఇంకా మృదువుగా ఉంటుంది. కాబట్టి, వాళ్ల ఉత్పత్తుల్లో పారబెన్స్‌, మినరల్‌ ఆయిల్స్‌, సల్ఫేట్స్‌ వంటివి లేకుండా పీహెచ్‌ 5-5.5 శాతం ఉన్నవే ఎంచుకుంటే మేలు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్