పల్లీలు తింటే బేబీకి అలర్జీ వస్తుందా..!

నా వయసు 29. ఇప్పుడు నేను మూడోనెల గర్భవతిని. ఇది నా మొదటి కాన్పు. ప్రెగ్నెన్సీలో కెఫీన్‌ మంచిది కాదు. వేరుశనగ తీసుకోకూడదంటున్నారు. తింటే బేబీకి పీనట్‌ అలర్జీ వస్తుంది అంటున్నారు నిజమేనా. ఈ రెండు అంటే నాకు చాలా ఇష్టం.

Published : 16 May 2024 02:57 IST

నా వయసు 29. ఇప్పుడు నేను మూడోనెల గర్భవతిని. ఇది నా మొదటి కాన్పు. ప్రెగ్నెన్సీలో కెఫీన్‌ మంచిది కాదు. వేరుశనగ తీసుకోకూడదంటున్నారు. తింటే బేబీకి పీనట్‌ అలర్జీ వస్తుంది అంటున్నారు నిజమేనా. ఈ రెండు అంటే నాకు చాలా ఇష్టం. వీటిని మానేయక తప్పదా?

ఓ సోదరి

గర్భం దాల్చిన తరవాత మొదటి మూడునెలలు చాలా కీలకం. ఎందుకంటే శిశువు శరీర అవయవాలు తయారయ్యేది ఈ దశలోనే. ఈ సమయంలో సమతులాహారం ఎంత అవసరమో కొన్ని రకాల ఆహార పదార్థాలను తగ్గించి తీసుకోవడమూ అంతే ముఖ్యం. అందులో కెఫీన్‌ కూడా ఒకటి. దీన్ని రోజుకి 300 మి.గ్రా. కంటే తక్కువ తీసుకోవాలి. అంటే రోజుకి సుమారు రెండు కప్పుల కాఫీ, టీ మాత్రమే తీసుకోవాలి. ఎందుకంటే.. ఇది ప్లాసెంటా, గర్భాశయం, శిశువు రక్తనాళాల మీద ప్రతికూల ప్రభావం చూపే అవకాశం ఉంది. పోతే గర్భవతిగా ఉన్నప్పుడు

వేరుశనగ తీసుకుంటే.. బేబీకి పీనట్‌ అలర్జీ వస్తోంది అనేది వాస్తవం కాదు. నిజానికి వీటిని తీసుకోవడం వల్ల రోగనిరోధక శక్తి పెరిగి ఇన్ఫెక్షన్లు రాకుండా ఉంటాయి. దీన్ని తినడంవల్ల హెమోగ్లోబిన్‌ పెరుగుతుంది. ఐరన్‌ లోపాన్నీ తగ్గించవచ్చు. కానీ చాలా కొద్దిమంది తల్లులకు మాత్రమే ఈ పీనట్‌ అలర్జీ ఉంటుంది. అలాంటివారు పోషకాహార నిపుణులను సంప్రదించి వీటికి బదులుగా వేరే ఆహారాన్ని ఎంచుకోవాలి. ఈ సమయంలో మీరు వాడే సప్లిమెంట్‌ ట్యాబ్లెట్స్‌తో పాటు, తినే ఆహారంలో ఫోలిక్‌యాసిడ్‌ తప్పనిసరిగా ఉండాలి. ఆకుకూరలు, శనగలు, బొబ్బర్లు, గోరుచిక్కుళ్లు, క్యారెట్‌ వంటి వాటిల్లో ఫోలిక్‌యాసిడ్‌ పుష్కలంగా లభిస్తుంది. కాబట్టి వీటినీ తీసుకుంటే మంచిది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్