మెడ మీద... సంచులేంటి?

మెడ మీద బొడిపెల్లా తగులుతున్నాయి. చూస్తే చర్మం ముడిపడి సంచుల్లా మారినట్లు కనిపిస్తున్నాయి... ఏమిటివి, ఎందుకొస్తున్నాయి? తగ్గించుకునే మార్గం ఉందా?

Updated : 19 May 2024 04:55 IST

మెడ మీద బొడిపెల్లా తగులుతున్నాయి. చూస్తే చర్మం ముడిపడి సంచుల్లా మారినట్లు కనిపిస్తున్నాయి... ఏమిటివి, ఎందుకొస్తున్నాయి? తగ్గించుకునే మార్గం ఉందా?

 ఓ సోదరి

వీటిని స్కిన్‌ ట్యాగ్స్, ఫైబ్రోఎపిటిల్లల్‌ పాలిప్స్‌ అంటాం. ప్రెగ్నెన్సీలో హార్మోనుల్లో హెచ్చుతగ్గుల కారణంగా ఇవి రావడానికి అవకాశం ఉంటుంది. బరువున్న వారిలోనూ కనిపిస్తుంటాయి. వీటికి ఏ క్రీములూ పనిచేయవు. సొంత వైద్యాలు చేసినా పనిచేయవు. పైగా ఇన్‌ఫెక్షన్‌కి గురయ్యే ప్రమాదం ఉంది. వైద్యులను సంప్రదించండి. లోకల్‌ అనస్థీషియా ఇచ్చి, రేడియో ఫ్రీక్వెన్సీ ద్వారా తొలగిస్తారు. వారం రోజులు ఎండలోకి వెళ్లకుండా ఉంటే చాలు. క్రయోథెరపీ, ఎండియాక్‌ లేజర్‌ ద్వారానూ తొలగించవచ్చు. ఏదైనా ఒక్క సిట్టింగ్‌ చాలు. అయితే ఇవి ఉన్నా ప్రమాదం ఏమీ ఉండదు. ఒకరి నుంచి మరొకరికీ సంక్రమించవు. చూడటానికి బాగా లేవని చికిత్స చేయించుకున్నా పర్లేదు. వీటితో కాంపిక్లేషన్స్‌ కూడా ఉండవు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్