బాధితురాలిపైనే దాడి చేస్తారా?

ఆరేళ్లు ప్రేమించానని వెంటపడ్డాడు. తన కుటుంబ సభ్యులకు చెబితే ఒప్పుకోరని అంటే... గుళ్లో పెళ్లి చేసుకున్నాం. అయితే, అప్పటికే అతడు మరో అమ్మాయి మెడలోనూ తాళి కట్టాడని తర్వాతే తెలిసింది. నిలదీస్తే వాళ్లమ్మ బలవంతం చేసిందని చెప్పాడు.

Eenadu icon
By Vasundhara Team Published : 28 Oct 2025 01:08 IST
Ee
Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
1 min read

ఆరేళ్లు ప్రేమించానని వెంటపడ్డాడు. తన కుటుంబ సభ్యులకు చెబితే ఒప్పుకోరని అంటే... గుళ్లో పెళ్లి చేసుకున్నాం. అయితే, అప్పటికే అతడు మరో అమ్మాయి మెడలోనూ తాళి కట్టాడని తర్వాతే తెలిసింది. నిలదీస్తే వాళ్లమ్మ బలవంతం చేసిందని చెప్పాడు. ఈలోగా పాప కడుపులో పడింది. అటు పుట్టింటివారి ఆదరణ లేదు. ఇటు భర్త మోసం చేశాడనే బాధలో ఉండగా, అత్త, అతడి మొదటిభార్య నా మీద దాడి చేశారు. బాధితురాలినైన నేను మోసగత్తెను ఎలా అవుతాను? నాకు న్యాయం జరిగేదెలా?

ఓ సోదరి

ప్రేమ పేరుతో జరుగుతోన్న మోసాలకు అంతులేకుండా పోతోంది. మీ పెళ్లి చట్టబద్ధంగా జరిగిందా? అంటే హిందూ సంప్రదాయం ప్రకారమో లేదా రిజిస్ట్రేషన్‌ చేయించుకోవడమో చేశారా? ఒకవేళ మీకంటే ముందే అతడు మరో వివాహం చేసుకుని ఉంటే... మీ పెళ్లి చెల్లదు. మోసం చేశాడని క్రిమినల్‌ కేసు పెట్టండి. తల్లికోసం ఒకరిని,  ప్రేమకోసం మరొకరిని పెళ్లి చేసుకునే వ్యక్తిని జీవితాంతం ఎలా నమ్ముతారు? మీపై దాడి చేసిన వారి మీద కూడా బీఎన్‌ఎస్‌ యాక్ట్‌ సెక్షన్‌-130 ప్రకారం పోలీసులకు ఫిర్యాదు ఇవ్వండి. కేసు రిజిస్టర్‌ చేయకపోతే క్రిమినల్‌ కేసుని ప్రైవేట్‌ కంప్లయింట్‌లా ఫైల్‌ చేయండి. గృహహింస చట్టం కింద వాళ్లందరి మీద కేసు పెట్టి సెక్షన్‌-18 కింద రక్షణ, సెక్షన్‌-20 కింద నెలకు తగిన పోషణ ఖర్చులు, సెక్షన్‌-22 ప్రకారం అనుభవించిన శారీరక, మానసిక క్షోభకి శాశ్వత పరిహారం కోరండి. ముందుగా మీడియేషన్‌ సెంటర్‌ని సంప్రదించి కంప్లయింట్‌ ఇస్తే వాళ్లు అందరినీ పిలిచి మాట్లాడతారు. మీ భర్తని హెచ్చరిస్తారు. మీకు నెలసరి భత్యం ఇప్పిస్తారు. వెంటనే ప్రయత్నించండి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్