ఆ నైపుణ్యాల్ని రెజ్యూమెలో చేర్చొచ్చా?

ఆరు నెలలుగా ఉద్యోగం కోసం చూస్తున్నా. ఎం.కామ్‌ పూర్తిచేశా. అకౌంట్స్‌లో పనిచేయాలనుంది. మావారి ఉద్యోగ బదిలీల కారణంగా ఏడేళ్లుగా ఎక్కడా పని చేయలేదు. ఈ సమయంలో పిల్లల పెంపకం, భర్తతోపాటు వివిధ ప్రదేశాలను చుట్టి రావడంవల్ల సానుకూల దృక్పథం,

Eenadu icon
By Vasundhara Team Published : 29 Oct 2025 03:25 IST
Ee
Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
2 min read

ఆరు నెలలుగా ఉద్యోగం కోసం చూస్తున్నా. ఎం.కామ్‌ పూర్తిచేశా. అకౌంట్స్‌లో పనిచేయాలనుంది. మావారి ఉద్యోగ బదిలీల కారణంగా ఏడేళ్లుగా ఎక్కడా పని చేయలేదు. ఈ సమయంలో పిల్లల పెంపకం, భర్తతోపాటు వివిధ ప్రదేశాలను చుట్టి రావడంవల్ల సానుకూల దృక్పథం, మద్దతుగా నిలవడం, వ్యవస్థీకృతంగా, చురుగ్గా ఉండటం... వంటి నైపుణ్యాలను నేర్చుకున్నా. వీటి గురించి రెజ్యూమెలో చెప్పొచ్చా? 

మీరు క్రానలాజికల్‌ రెజ్యూమెను రూపొందించాలనుకుంటే, వరుసలో ఎక్కడా గ్యాప్‌లు లేకుండా వివరాలు తెలపడం ముఖ్యం.  కుటుంబంతో గడిపిన సమయాన్ని సరళంగా ఈ ఫార్మాట్‌కు అనుగుణంగా చేర్చవచ్చు. ఉదా: 2018-24 మధ్య గృహిణిగా... నాయకత్వం, సంస్థాగత నైపుణ్యాలు, కీలక విజయాలను ప్రదర్శించే ఏదైనా వాలంటీర్, కమిటీ, అపార్ట్‌మెంట్‌ సొసైటీలో పని చేసి ఉంటే కచ్చితంగా వీటిని చెప్పొచ్చు. ఆ అనుభవం వృత్తిలో ఉపయోగించేది అయితే హైలైట్‌ చేయండి. లేదంటే కవర్‌ లెటర్‌ని రూపొందించొచ్చు. దీన్లో వ్యక్తిగత, కుటుంబ అనుభవాలు మిమ్మల్ని మంచి ఉద్యోగిగా ఎలా మారుస్తాయో చెప్పండి. ఇలా కాకుంటే ఫంక్షనల్‌ రెజ్యూమెనూ తయారుచేయొచ్చు. ఈ శైలి మీ నైపుణ్యాలను సూటిగా ప్రదర్శించడానికి సాయపడుతుంది. చేరబోయే ఉద్యోగంలో మీరెలా సరిపోతారో వెంటనే నిర్ణయించడానికి ఈ శైలి వీలు కల్పిస్తుంది. ఉద్యోగ వివరణను అధ్యయనం చేయడం, యజమాని కోరుతున్న నైపుణ్యాలను నిర్ణయించడం ద్వారా ఫంక్షనల్‌ రెజ్యూమె రూపొందించొచ్చు. శీర్షికలను ఉపయోగించడం ద్వారా ఇది సమర్థవంతంగా చేయొచ్చు. ఉదా: కమ్యూనికేషన్స్, డిజైన్, సమావేశాల నిర్వహణ వీటిలో మీకు ఏ నైపుణ్యాలు వర్తిస్తాయో వాటిని చెప్పండి. మొదటిదానికంటే ఈ తరహా రెజ్యూమె ఎక్కువ ప్రభావాన్ని చూపుతుంది. ఏదైనా సందర్భంలో ప్రాజెక్టులకు నాయకత్వం వహించడం, ఉత్పాదకతను మెరుగుపరచడం(శాతాలతో), ఖర్చులను తగ్గించడం, సభ్యత్వాన్ని పెంచడం లేదా ఉద్యోగంలో మీ ప్రభావాన్ని ప్రదర్శించే ఇతర లక్ష్యాన్ని సాధించడం వంటి విజయాలను గుర్తించడం చాలా ముఖ్యం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్