ఏబీసీ తాగొచ్చా..!

ఆపిల్, క్యారెట్, బీట్‌రూట్‌ (ఏబీసీ) జ్యూస్‌ తాగితే మెరిసే చర్మం సొంతమవుతుందని, ఈమధ్య సామాజిక మాధ్యమాల్లో బాగా ప్రచారం జరుగుతోంది నిజమేనా?

Eenadu icon
By Vasundhara Team Updated : 30 Oct 2025 12:25 IST
Ee
Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
1 min read

ఆపిల్, క్యారెట్, బీట్‌రూట్‌ (ఏబీసీ) జ్యూస్‌ తాగితే మెరిసే చర్మం సొంతమవుతుందని, ఈమధ్య సామాజిక మాధ్యమాల్లో బాగా ప్రచారం జరుగుతోంది నిజమేనా? ఇది తాగితే ఫలితం ఉంటుందా?

సౌజన్య, హైదరాబాద్‌

ఆపిల్, బీట్‌రూట్, క్యారెట్‌... వేటికవే ప్రత్యేక ఆరోగ్య ప్రయోజనాలను కలిగి ఉన్నాయి. అయితే బీట్‌రూట్‌లో నైట్రేట్‌ ఎక్కువగా ఉంటుంది. దీనివల్ల రక్తపోటు తగ్గుతుందని కొన్ని అధ్యయనాలు వెల్లడించాయి. కానీ, ఈ మూడు కలిపి తీసుకుంటే మెరిసే చర్మం సొంతమవుతుందని ఏ పరిశోధనల్లోనూ నిర్ధరణ కాలేదు. పైగా క్యారెట్, బీట్‌రూట్‌లు రోజూ తినలేం. కాయగూరల రూపంలో కంటే ఇలా రసాలుగా తీసుకుంటే ఎక్కువ లాభాలుంటాయి. దీంతో ప్రతిరోజు నిర్దిష్ట మొత్తంలో మన శరీరానికి కావాల్సిన యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్‌ సి, పాలీఫెనాల్స్, బీటాకెరోటిన్లు అంది చర్మ ఆరోగ్యానికి మేలు చేస్తాయి. అయితే, వడబోయకుండా తాగినప్పుడు మాత్రమే ప్రయోజనం ఉంటుంది. అలా తాగలేనివారు నిమ్మరసం కలిపి కూడా తీసుకోవచ్చు. రోగనిరోధక శక్తి తక్కువగా ఉండేవారు వీటిని శుభ్రంగా కడిగి, పైపొట్టుని తీసి మాత్రమే జ్యూస్‌ చేసుకుని తాగాలి. ఇవి మీ శరీర తత్వాన్ని బట్టి సరిపడుతుందో లేదో గమనించుకోవాలి. డయాబీటీస్‌ ఉన్నవారు తేనె కలపకుండా తీసుకోవాలి. ఒకవేళ రసాల రూపంలో పడనివాళ్లు, వయసులో పెద్దవాళ్లు, గర్భిణులు సూప్‌ చేసి తీసుకుంటే మేలు. అయితే తీసుకునే ముందు పోషకాహార నిపుణుల్ని సంప్రదించండి.

Trending

Tags :
Published : 30 Oct 2025 00:44 IST

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్