నెలన్నరగా రక్తస్రావం!

నా వయసు 32 ఏళ్లు. నాకు మొదట్నుంచీ పీసీఓడీ ఉంది. గత నెలన్నరగా రోజూ కొంతైనా రక్తస్రావం కనిపిస్తోంది.

Eenadu icon
By Vasundhara Team Published : 31 Oct 2025 01:20 IST
Ee
Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
1 min read

నా వయసు 32 ఏళ్లు. నాకు మొదట్నుంచీ పీసీఓడీ ఉంది. గత నెలన్నరగా రోజూ కొంతైనా రక్తస్రావం కనిపిస్తోంది. ఒకట్రెండు రోజులు ఆగినట్లున్నా మళ్లీ కనిపిస్తోంది. ఇదేమైనా సమస్యా? తగ్గుతుందా?

ఓ సోదరి

పీసీఓడీ ఒక్కొక్కరిలో ఒక్కోలా కనిపిస్తుంది. కొందరిలో కొన్ని నెలలపాటు నెలసరి రాదు. మరికొందరిలో ఊబకాయం, ముఖమ్మీద అవాంఛిత రోమాలు, నలుపుదనం పెరగడం వంటివి కనిపిస్తాయి. మీలో ఇలా నెలన్నరగా రక్తస్రావం కనిపించడమూ అందులో భాగమే అయ్యుండొచ్చు. అయితే ఇది పూర్తిగా పీసీఓడీ వల్లే అనీ చెప్పలేం. హార్మోనుల్లో అసమతుల్యత కూడా కారణం కావొచ్చు. హార్మోనుల్లో తేడా కారణంగా ఎండోమెట్రియం నుంచి కావాల్సిన సహకారం అందదు. దీంతో పీరియడ్‌లో భాగంగా నెలకోసారి విడుదలవ్వాల్సింది కాస్తా ఇలా కొద్దికొద్దిగా బయటకు వస్తుంది. దీంతో తరచూ రక్తస్రావం కనిపిస్తుంటుంది. దీన్ని ఆపాలంటే ముందు కారణమేంటో కనుక్కోవాలి. కాబట్టి, ఓసారి గర్భాశయ స్కాన్‌ చేయించుకోండి. అప్పుడు దానిలో ఫైబ్రాయిడ్స్, పాలిప్స్‌ ఇలా ఏమైనా ఉన్నాయేమో తెలుస్తుంది. ఇవీ ఈ సమస్యకు కారకాలే. ముందు మీరు చేయాల్సింది కారణం కనుక్కోవడం. అప్పుడే సరైన చికిత్సని సూచించగలం. ముందు దాన్ని తెలుసుకునే ప్రయత్నం చేయండి. ఆపై నిపుణుల సలహాతో అవసరమైన మందులను వాడితే సమస్య తగ్గుతుంది. 

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్