వారసత్వ ఉద్యోగం దక్కేనా?

ఇంటర్‌ రెండో సంవత్సరం (1998) పూర్తి చేయలేదు. దూరవిద్య ద్వారా బీఏ (2015) పూర్తిచేశాను. ఇప్పటివరకూ ఇంటర్‌కు సంబంధించిన ధ్రువపత్రాలేమీ తీసుకోలేదు. ఫర్వాలేదా? ఇప్పుడు ఇంటర్‌ వన్‌ సిట్టింగ్‌లో రాయాలనుకుంటున్నాను. మంచిదేనా? నాకున్న ఉద్యోగావకాశాల వివరాలను తెలపండి.

Updated : 08 Dec 2022 19:43 IST

* ఇంటర్‌ రెండో సంవత్సరం (1998) పూర్తి చేయలేదు. దూరవిద్య ద్వారా బీఏ (2015) పూర్తిచేశాను. ఇప్పటివరకూ ఇంటర్‌కు సంబంధించిన ధ్రువపత్రాలేమీ తీసుకోలేదు. ఫర్వాలేదా? ఇప్పుడు ఇంటర్‌ వన్‌ సిట్టింగ్‌లో రాయాలనుకుంటున్నాను. మంచిదేనా? నాకున్న ఉద్యోగావకాశాల వివరాలను తెలపండి.

- రాణి, రాజమండ్రి

* బోర్డ్‌ ఆఫ్‌ ఇంటర్మీడియట్‌ వారిని సంప్రదించి మీరు పూర్తిచేయని రెండో సంవత్సరం ప్రస్తుతం కొనసాగించడం సాధ్యపడుతుందేమో తెలుసుకోండి. అలా కుదరకపోతే అప్పుడు ఓపెన్‌ స్కూలింగ్‌ ద్వారా ఇంటర్‌ను పూర్తి చేయవచ్చు. అప్పుడు మీరు ఇంటర్‌, బీఏ అర్హత ఉన్న స్టాఫ్‌ సెలక్షన్‌ కమిషన్‌, పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌, బ్యాంకు ఉద్యోగాలకు నోటిఫికేషన్‌ వెలువడినప్పుడు దరఖాస్తు చేసుకోవచ్చు. సాధారణంగా ఇంటర్‌ వన్‌ సిట్టింగ్‌లో కాకుండా రెండు సంవత్సరాల ఇంటర్‌ విద్యను రెగ్యులర్‌ విధానంలో అభ్యసించడం మంచిది.


* బీటెక్‌ పూర్తిచేశాను. మా పెదనాన్న సెంట్రల్‌ జైలు సూపరింటెండెంట్‌గా చేస్తున్నారు. ఆయన త్వరలో పదవీ విరమణ పొందనున్నారు. వారసత్వంగా ఆయన ఉద్యోగం నాకు వచ్చే అవకాశం ఉందా?

- మహేష్‌ నాయుడు, పాల్వంచ

* వారసత్వ ఉద్యోగాలపట్ల సంస్థలు తమకంటూ ప్రత్యేక నియమ నిబంధనలు ఏర్పరచుకుంటాయి. సాధారణంగా వారికి పుట్టిన పిల్లలకు మాత్రమే వారసత్వ ఉద్యోగావకాశాలుంటాయి. కాబట్టి, సంబంధిత సంస్థ (జైలు) అధికారులతో సంప్రదించడం ద్వారా మీకు అర్హత ఉందో లేదో తెలుసుకోండి.


* బీటెక్‌ (సివిల్‌) పూర్తిచేసి, ప్రభుత్వ ఉద్యోగాన్ని సంపాదించాను. నాకు దూరవిద్య ద్వారా పై చదువులను కొనసాగించాలని ఉంది. పీజీసెట్‌ ద్వారా దూరవిద్యలో ఎంటెక్‌ను అందించే కళాశాలల వివరాలను తెలపండి.

- పి. రవితేజ

* ఉద్యోగం చేస్తూ ఉన్నతవిద్యను అభ్యసించాలనుకునే మీ ఆసక్తికి అభినందనలు. ఐఐకేఎం కర్ణాటక వారు ఎంటెక్‌ కోర్సును సివిల్‌ ఐచ్ఛికంలో అందిస్తున్నారు. ఇన్‌స్టిట్యూషన్స్‌ ఆఫ్‌ ఇంజినీర్స్‌ (ఐఈ), ఇండియా వారు పోస్టు గ్రాడ్యుయేట్‌ డిగ్రీ సివిల్‌ అందిస్తున్నారు. బీఈ లేదా బీటెక్‌ను 60% మార్కులతో పూర్తిచేసి కనీసం మూడు సంవత్సరాల పని అనుభవం ఉన్నవారు అర్హులు. వీటికి సంవత్సరం పొడవునా రిజిస్ట్రేషన్‌ చేసుకునే వీలుంది. మేలో పరీక్షలు జరుగుతాయి. ఎంటెక్‌ దూరవిద్యలో అభ్యసించేముందు ప్రోగ్రామ్‌ గుర్తింపు, ఈక్వివలెన్స్‌ గురించి తెలుసుకుని, ప్రభుత్వ గుర్తింపు ఉన్నవాటినే ఎంచుకోవాలి.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్