పిల్లల ముందు వద్దు..

భార్యాభర్తలన్నాక వాగ్వివాదాలూ మామూలే! కానీ ఏ పరిస్థితుల్లోనూ పిల్లల ముందు వద్దు. తల్లిదండ్రులు తరచూ ఇలా గొడవపడటం వల్ల చిన్నారుల్లో కుంగుబాటూ, మానసిక ఆందోళనా పెరుగుతాయంటున్నారు నిపుణులు.

Updated : 09 Dec 2022 15:27 IST

భార్యాభర్తలన్నాక వాగ్వివాదాలూ మామూలే! కానీ ఏ పరిస్థితుల్లోనూ పిల్లల ముందు వద్దు. తల్లిదండ్రులు తరచూ ఇలా గొడవపడటం వల్ల చిన్నారుల్లో కుంగుబాటూ, మానసిక ఆందోళనా పెరుగుతాయంటున్నారు నిపుణులు.
కోపం వచ్చినప్పుడు భాగస్వామిని అడిగేయాలనీ, కడిగేయాలనీ అనిపిస్తుంది. కానీ పిల్లల మనసునీ కాస్త అర్థం చేసుకోండి. చిన్నారుల్ని మానసికంగా ఆందోళనకు గురిచేసే విషయాల్లో.. తల్లిదండ్రులు విడిపోతారనే భయం కూడా ఒకటని చెబుతున్నాయి పరిశోధనలు. విడిపోవడం దాకా అక్కర్లేదు.. అమ్మానాన్నలిద్దరూ ఎడమొహం పెడమొహం అన్నట్టున్నా చదువుల్లో ఏకాగ్రత కోల్పోతారు. కాబట్టి మీ కోపాన్ని వ్యక్తం చేయడానికి ప్రత్యామ్నాయాల గురించి ఆలోచించండి.
* ఎదుటివారిపై మీ కోపాన్నీ, వారి ప్రవర్తన వల్ల ఏర్పడ్డ బాధని ఓ కాగితంపై రాయండి. వాటిని పంచుకునేందుకు ఫిర్యాదు బాక్సులు ఏర్పాటు చేసుకోండి. ఇందువల్ల పిల్లల ముందు బయటపడే పరిస్థితి ఎదురు కాదు.
* నిజానికి మనసులో ఉన్న ఏవో అసంతృప్తులూ, ఇంకేవో విషయాలే కోపంగా పెల్లుబుకుతాయి. పిల్లల మధ్యకి రాకముందే వాటి గురించి మాట్లాడుకోండి. సమస్య ఒక్కసారిగా పరిష్కారం కాకున్నా.. కోప్పడే ఆస్కారం తగ్గుతుంది. ఒకవేళ దానిపై కోపం ఉన్నా.. పిల్లల ముందు ఆ కాసేపైనా మౌనంగా ఉండండి. ఇతర అంశాలు ప్రస్తావించండి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్