సహజ ఉత్పత్తులకే నయన్ ఓటు
మూడు పదులు నిండినా చెక్కు చెదరని అందం నయనతార సొంతం. తన చర్మ, శిరోజాల సంరక్షణ గురించి ఇలా చెప్పుకొచ్చింది. ‘సూర్యకిరణాలకు చర్మం పాడవకుండా సన్‌స్క్రీన్‌ను తప్పక వాడతా. నా బ్యాగులో ఇది లేకుండా అడుగు బయట పెట్టను. రసాయనరహిత, సహజసిద్ధలేపనాలకే ప్రాధాన్యమిస్తా. చర్మం మెరిసేలా, మొటిమలు...
మూడు పదులు నిండినా చెక్కు చెదరని అందం నయనతార సొంతం. తన చర్మ, శిరోజాల సంరక్షణ గురించి ఇలా చెప్పుకొచ్చింది.
‘సూర్యకిరణాలకు చర్మం పాడవకుండా సన్‌స్క్రీన్‌ను తప్పక వాడతా. నా బ్యాగులో ఇది లేకుండా అడుగు బయట పెట్టను. రసాయనరహిత, సహజసిద్ధలేపనాలకే ప్రాధాన్యమిస్తా. చర్మం మెరిసేలా, మొటిమలు రాకుండా ఇవే కాపాడుతుంటాయి. దాహం వేసినా వేయకపోయినా ప్రతిరెండు గంటలకోసారి నీళ్లు తాగుతుంటా. అంతేకాదు అల్పాహారం, మధ్యాహ్న భోజనం, రాత్రి డిన్నర్... దేంతోనైనా ఏదైనా తాజా పండ్ల రసం ఉండాల్సిందే. షూటింగ్ బ్రేక్స్లోనూ పండ్లరసాన్నే తీసుకుంటా. కాఫీ, టీ, శీతలపానీయాలకు చాలా దూరం. రోజూ క్లెన్సింగ్, టోనింగ్, మాయిశ్చరైజింగ్ చేసుకోవడం మాత్రం తప్పనిసరి. ఇవన్నీ చర్మాన్ని తాజాగా, మృదువుగా ఉంచుతాయి. నిద్రపోయే ముందు మేకప్‌ను తప్పక తొలగించి మాయిశ్చరైజర్ రాస్తా. శిరోజాలనూ నిర్లక్ష్యం చేయను. సమయం దొరికినప్పుడల్లా స్వచ్ఛమైన కొబ్బరినూనెతో మర్దన చేస్తా. ఇది జుట్టును ఆరోగ్యంగా ఉంచి మృదువుగా మారుస్తుంది. అప్పుడప్పుడు తేలికైన ప్యాక్స్ వేస్తుంటా. దీంతో కేశాలు రాలవు, మెత్తగా పట్టుకుచ్చులా మెరుస్తుంటాయి’.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
బ్యూటీ & ఫ్యాషన్
- Makeup: ఈ పొరపాట్లు వద్దు!
- మ్యాచింగ్ పోట్లీ మస్తుంది!
- అందానికి చింతపండు..!
- నిర్మలమ్మ ‘బడ్జెట్’ శారీస్.. చీరచీరకో ప్రత్యేకత!
- చినుకుల్లో కురులు జాగ్రత్త!
ఆరోగ్యమస్తు
- ఎత్తును బట్టే..!
- Nayanthara : నచ్చిందే తింటా.. నోరు కట్టేసుకోను!
- ‘అమ్మా’ అనే పిలుపు వినాలని!
- మీ మౌత్‌వాష్ ఎలాంటిది?
- చాందీపుర వైరస్.. పిల్లల విషయంలో ఈ జాగ్రత్తలు తప్పనిసరి!
అనుబంధం
- కొలీగ్‌తో రెండో పెళ్లి.. పేరెంట్స్ వద్దంటున్నారు!
- ‘777’ నియమంతో... బంధం బలోపేతం!
- పిల్లలకు ఎలాంటి పుస్తకం కొంటున్నారు..?
- వాళ్ల ప్రేమ నిజమా? నకిలీనా?
- Sushmita Sen: లైంగిక అంశాల గురించి నా పిల్లలతో అలా చర్చిస్తా!
యూత్ కార్నర్
- పాపులారిటీ కోసం ప్రాణాలెందుకు రిస్క్‌లో పెడతారు?!
- తెలుగమ్మాయి... బ్రిటన్‌లో మెరిసింది!
- వాళ్లున్నప్పుడు మారిపోతాడు!
- రెండేళ్ల కష్టం... రూ.54 లక్షల ఉద్యోగం!
- మలార్ వాట్సాప్... టీచర్!
'స్వీట్' హోం
- వర్షాలకు మొక్కలు పాడవకుండా..!
- మొక్కలకు కాఫీ పొడి వేస్తున్నారా?
- తగిలిస్తే... పిల్లి వచ్చే!
- నూరు వరహాలతో నిండుగా
- వ్యాపారమా... ఉద్యోగమా?
వర్క్ & లైఫ్
- Flower Truck Business: అందమైన పూల బొకేలతో.. లక్షలు సంపాదిస్తూ..!
- బరువెక్కుతున్న తెలుగు రాష్ట్రాలు!
- ఈ అలవాట్లే మనల్ని ధనవంతుల్ని చేస్తాయట!
- కేర్ టేకర్లు... కోట్లలో కావలెను!
- ఆఫీసులో ఒత్తిడి తగ్గుతుందిలా..