జుట్టుకు జామాకు!

ఈమధ్య కాలంలో చాలామందిలో కామన్‌గా కనిపిస్తోన్న సమస్య జుట్టు రాలడం. విపరీతమైన ఒత్తిడి, పోషకాహార లోపం, కాలుష్యం ప్రభావం.. ఇందుకు కారణమవుతున్నాయి. అయితే జామాకుతో ఈ సమస్యకు చెక్‌ పెట్టచ్చంటున్నారు నిపుణులు. జామాకుల్లో ఉన్న ఔషధ గుణాలు జుట్టు రాలడాన్ని అరికట్టి ఒత్తుగా పెరిగేలా చేస్తాయంటున్నారు.

Published : 20 Apr 2024 20:35 IST

ఈమధ్య కాలంలో చాలామందిలో కామన్‌గా కనిపిస్తోన్న సమస్య జుట్టు రాలడం. విపరీతమైన ఒత్తిడి, పోషకాహార లోపం, కాలుష్యం ప్రభావం.. ఇందుకు కారణమవుతున్నాయి. అయితే జామాకుతో ఈ సమస్యకు చెక్‌ పెట్టచ్చంటున్నారు నిపుణులు. జామాకుల్లో ఉన్న ఔషధ గుణాలు జుట్టు రాలడాన్ని అరికట్టి ఒత్తుగా పెరిగేలా చేస్తాయంటున్నారు.

జామాకుల్లో విటమిన్ 'సి' ఉంటుంది. ఇది శరీరంలో కొలాజెన్ ఉత్పత్తిని పెంచుతుంది. ఫలితంగా జుట్టు ఆరోగ్యంగా, ఒత్తుగా పెరుగుతుంది. ఈ ఆకుల్లో యాంటీ ఆక్సిడెంట్ గుణాలు సైతం ఉంటాయి. ఇవి ఫ్రీరాడికల్స్‌ని శరీరం నుంచి బయటకు పంపించి వెంట్రుకలు డ్యామేజ్‌ కాకుండా కాపాడతాయి. అలాగే జామాకుల్లో ఉండే లైకోపీన్ హానికారక అతి నీలలోహిత కిరణాల నుంచి జుట్టుని సంరక్షిస్తుంది.

సిల్కీ హెయిర్ కోసం..

గిన్నెలో లీటరు నీటిని పోసి వేడి చేయాలి. దీనిలో శుభ్రం చేసిన జామాకులు వేసి 20 నిమిషాల పాటు మరిగించాలి. దీన్ని చల్లారనిచ్చి మరో గిన్నెలోకి వడకట్టుకోవాలి. ఈ మిశ్రమం హెయిర్ కండిషనర్‌గా పనిచేస్తుంది. షాంపూతో తలస్నానం చేసిన తర్వాత జుట్టు బాగా ఆరనివ్వాలి. ఆ తర్వాత ఈ మిశ్రమాన్ని కుదుళ్ల నుంచి చివర్ల వరకు అప్లై చేయాలి. అలాగే కుదుళ్లకు పట్టేలా పది నిమిషాల పాటు మర్దన చేసుకోవాలి. ఇలా రెండు గంటలు ఉంచుకొని తర్వాత గోరువెచ్చని నీటితో జుట్టును కడిగేస్తే సరి. కురులు మృదువుగా, సిల్కీగా మారతాయి.

చుండ్రుకు చెక్‌!

ఒత్తిడి, కాలుష్యం కారణంగా చాలామంది ఎదుర్కొంటోన్న సమస్య చుండ్రు. దీనివల్ల దురదతో పాటు వెంట్రుకలు బాగా రాలిపోతుంటాయి. జామాకులతో తయారుచేసుకున్న హెయిర్‌ ప్యాక్‌ ఈ విషయంలో మంచి ఫలితాన్నిస్తుంది. జామాకులను బాగా ఎండబెట్టి పొడి చేసుకోవాలి. దీనిలో కొద్దిగా నీటిని కలిపి పేస్ట్‌లా తయారు చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని తలకు పట్టించి పావుగంట ఆరనివ్వాలి. ఆ తర్వాత గోరువెచ్చని నీటితో తలస్నానం చేయాలి. ఇలా తరచూ చేస్తూ ఉంటే చుండ్రు సమస్య తగ్గుతుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్