జుట్టు విషయంలో ఈ జాగ్రత్తలు పాటిస్తున్నారా?

బయట దొరికే కొన్ని షాంపూలు అందరికీ పడకపోవచ్చు. ఇలాంటి సందర్భాల్లో జుట్టు డ్యామేజ్ అయ్యే ఆస్కారం లేకపోలేదు. చివర్లు చిట్లిపోవడం, జుట్టు పొడిబారిపోవడం, వెంట్రుకలు రాలిపోవడం.. మొదలైన సమస్యలు ఎదురవచ్చు. ఈ క్రమంలో ఇంట్లోనే సహజసిద్ధమైన పదార్థాలతో....

Updated : 18 Oct 2022 20:59 IST

బయట దొరికే కొన్ని షాంపూలు అందరికీ పడకపోవచ్చు. ఇలాంటి సందర్భాల్లో జుట్టు డ్యామేజ్ అయ్యే ఆస్కారం లేకపోలేదు. చివర్లు చిట్లిపోవడం, జుట్టు పొడిబారిపోవడం, వెంట్రుకలు రాలిపోవడం.. మొదలైన సమస్యలు ఎదురవచ్చు. ఈ క్రమంలో ఇంట్లోనే సహజసిద్ధమైన పదార్థాలతో షాంపూ తయారుచేసుకుని వాడితే కొంతవరకు ఫలితం ఉండచ్చంటున్నారు నిపుణులు.

ఇందుకోసం..

✮ డిస్టిల్డ్‌ వాటర్‌ - అరకప్పు

✮ లిక్విడ్‌ క్యాస్టైల్‌ సోప్‌ - బాటిల్‌లో సగం మోతాదులో తీసుకోవాలి

✮ కలబంద గుజ్జు - అరకప్పు

✮ విటమిన్‌ ఇ నూనె - 10 చుక్కలు

✮ వెజిటబుల్‌ గ్లిజరిన్‌ - 2 టీస్పూన్లు

✮ ఏదైనా అత్యవసర నూనె - కొన్ని చుక్కలు

వీటన్నింటినీ ఒక బాటిల్‌లోకి తీసుకొని బాగా కలిసేంత వరకు షేక్‌ చేయాలి. ఇలా తయారుచేసుకున్న షాంపూను తలస్నానం చేసే ముందు జుట్టుపై మర్దన చేసుకొని కొన్ని నిమిషాల పాటు అలాగే ఉంచుకోవాలి. ఆపై చల్లటి నీటితో తలస్నానం చేయాలి. ఈ సహజసిద్ధమైన షాంపూ డ్యామేజ్‌ అయిన జుట్టును రిపేర్‌ చేయడంతో పాటు జుట్టు ఆరోగ్యాన్ని పెంచుతుందని సూచిస్తున్నారు నిపుణులు.

ఈ చిట్కాల ద్వారా..

ఇదేవిధంగా వివిధ కారణాల వల్ల జుట్టు డ్యామేజ్ అయినప్పుడు ఇంట్లోనే కొన్ని చిట్కాలు పాటించడం ద్వారా పరిష్కారం పొందచ్చు.

✮ జుట్టును కర్లీగా, స్ట్రెయిట్‌గా చేసుకోవడానికి వాడే హెయిర్‌స్టైలింగ్ టూల్స్ వల్ల వేడి ఉత్పత్తవడం కారణంగా కూడా జుట్టు డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంది. ఇలాంటి సందర్భాల్లో జుట్టు తత్వాన్ని బట్టి నాణ్యమైన హెయిర్ సీరమ్ వాడచ్చు. వేడి వల్ల డ్యామేజ్ అయిన జుట్టును తిరిగి రిపేర్ చేసుకోవచ్చు. అయితే ఈ విషయంలో సౌందర్య నిపుణుల సలహాలు తీసుకోవడం మంచిది.

✮ రోజువారీ తీసుకునే ఆహారంతో కూడా డ్యామేజ్‌ అయిన జుట్టును తిరిగి రిపేర్‌ చేసుకోవచ్చు. ఈ క్రమంలో సీజనల్‌ పండ్లు, ఆకుకూరలు, ఆకుపచ్చటి కాయగూరలు, ఉసిరి.. వంటివి క్రమం తప్పకుండా తీసుకోవాల్సి ఉంటుంది.

✮ జుట్టు డ్యామేజ్‌ కాకుండా ఉండాలంటే సాధ్యమైనంతవరకు వేడి ఉత్పత్తుల్ని వాడకపోవడమే మంచిదంటున్నారు నిపుణులు. ఒకవేళ వాడాల్సి వస్తే.. వెంట్రుకలు పాడవకుండా ముందుగా సన్‌స్క్రీన్ హెయిర్‌ స్ప్రే, హెయిర్‌ జెల్‌.. వంటివి రాసుకోవాలని సూచిస్తున్నారు.

మరో ముఖ్య విషయం ఏంటంటే.. జుట్టు ఆరోగ్యం కోసం వాడే ఉత్పత్తుల విషయంలో ఎలాంటి సందేహాలున్నా, ఏ జుట్టు తత్వానికి ఎలాంటి ఉత్పత్తులు వాడాలో తెలియకపోయినా నిపుణుల సలహా తీసుకోవడం మంచిది.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్