menstrual cramps: నెలసరి నొప్పులకు ఉపశమనం..

కొందరికి నెలసరి సమయంలో కడుపులో నొప్పి వస్తుంటుంది. భరించలేక మాత్రలు వేసుకుంటే వాటితో దుష్ప్రభావాలు. సహజంగా తగ్గించుకోవాలా హనుమానాసనం ప్రయత్నించండి.

Published : 15 Apr 2023 00:20 IST

కొందరికి నెలసరి సమయంలో కడుపులో నొప్పి వస్తుంటుంది. భరించలేక మాత్రలు వేసుకుంటే వాటితో దుష్ప్రభావాలు. సహజంగా తగ్గించుకోవాలా హనుమానాసనం ప్రయత్నించండి. ఒక్కసారిగా మార్పు వచ్చేయదు. కానీ నెమ్మదిగా విముక్తి కలగడం తథ్యం.

ఎలా చేయాలి.. శరీరాన్ని ముందు వార్మప్‌ చేసుకోవాలి. అంటే చేతులు, కాళ్లు అటూ ఇటూ తిప్పడం లాంటి వ్యాయామంతో శరీరం కొంచెం ఉత్తేజితమవుతుంది. ఆ తర్వాతే హనుమానాసనం వేసేందుకు సిద్ధం కావాలి. ముందు కాళ్లను నెమ్మదిగా ఎడంగా పెట్టండి. కుడి కాలిని ముందుకు చాచి మెల్లమెల్లగా ఎడమ కాలిని పక్కకు జరుపుతూ వెనక్కి పంపాలి. చేతులు రెండూ నేల మీద స్థిరంగా ఆనించి కాలిని నెమ్మదిగా వెనక్కి జరపాలి. ఫొటోలో చూపినట్లుగా రెండు కాళ్లూ సరళరేఖలా తిన్నగా రావడం అలవాటు లేనివాళ్లకి తేలికేమీ కాదు. అందుకు కొన్ని రోజులు పడుతుంది. అప్పటికీ రాలేదంటే ఒక దిండును ఆసరాగా పెట్టుకుని జరపాలి. కాలు పూర్తిగా వెనక్కి వెళ్లిన తర్వాత చేతులు రెండు తల మీదుగా పైకి తీసుకెళ్లి నమస్కరిస్తున్నట్లు ఉంచాలి. ఉండ గలిగినంతసేపు ఈ భంగిమలో ఉండి మెల్లగా ఎడమ కాలిని ముందుకు తీసుకురావాలి. ఇదే విధంగా కుడికాలిని వెనక్కి పంపి కొన్ని క్షణాలు ఉండి యధాస్థితికి రావాలి.

ఇవీ ప్రయోజనాలు... హనుమానాసనంతో కాళ్ల పిక్కలు, కండరాలు, పాదాలు, కటి భాగం, తొడలు వీటన్నిటికీ ఒత్తిడి తగులుతుంది. ముఖ్యంగా బ్యాలెన్సింగ్‌ బాగుంటుంది. నరాల వ్యవస్థ ఉత్తేజితమౌతుంది. నెలసరి సమయంలో వచ్చే కడుపు నొప్పి, ఇతర ఇబ్బందులు ఈ ఆసనం వేయడం వల్ల తగ్గుతాయి. కాళ్లే కాకుండా.. పొత్తికడుపు పైభాగం, చేతులు.. ఇలా శరీరంలో ప్రతి భాగానికీ ఒత్తిడి కలిగి చురుగ్గా తయారవుతాయి. రక్త సరఫరా సవ్యంగా ఉంటుంది. జీర్ణ ప్రక్రియ బాగుంటుంది.

ఎవరు చేయకూడదు.. గర్భిణులు, కీళ్ల నొప్పులు ఉన్నవాళ్లు, మోకాళ్ల చికిత్స చేయించుకున్నవాళ్లు, తీవ్ర అనారోగ్య సమస్యలు ఉన్నవాళ్లు ఈ ఆసనం చేయకూడదు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్