ఆ సమస్యలు దూరం..

మనలో కొందరు నెలసరి ఇబ్బందులతో అవస్థ పడుతుంటారు. పీరియడ్స్‌ సమయానికి రాకపోవడాన్ని చిన్న విషయంగా భావిస్తాం కానీ నిజానికది పెద్ద సమస్యే. శరీరంలో సమతుల్యతను దెబ్బ తీయడంతోపాటు మరెన్నో అనారోగ్యాలకూ కారణమవుతుంది.

Updated : 25 Mar 2023 16:54 IST

నలో కొందరు నెలసరి ఇబ్బందులతో అవస్థ పడుతుంటారు. పీరియడ్స్‌ సమయానికి రాకపోవడాన్ని చిన్న విషయంగా భావిస్తాం కానీ నిజానికది పెద్ద సమస్యే. శరీరంలో సమతుల్యతను దెబ్బ తీయడంతోపాటు మరెన్నో అనారోగ్యాలకూ కారణమవుతుంది. దీనికి చెక్‌ చెప్పాలంటే ఉష్ట్రాసనం వేయండి. దీంతో మరెన్నో గైనిక్‌ సమస్యలూ దూరమవుతాయి. టీనేజీ అమ్మాయిల నుంచి నడి వయసు దాటిన స్త్రీల వరకూ సాయపడే ఆసనమిది.

మోకాళ్ల మీద కూర్చోవాలి. రెండు పాదాలనూ కిందికి అదిమిపెట్టి ఉంచాలి. వీలైనంత వెనక్కి వంగి, కుడి చేత్తో కుడి కాలి మడమని, ఎడమ చేత్తో ఎడమకాలి మడమని పట్టుకోవాలి. తలను పూర్తిగా కిందికి వంచేయాలి. ఫొటోలో చూపిన విధంగా పొట్ట భాగం ముందుకు ఉండేలా చూడాలి. ఈ భంగిమలో ఎంతసేపు ఉండగలిగితే అంతసేపు ఉండొచ్చు. కనీసం 20 క్షణాలు ఉండగలిగితే మంచిది. తర్వాత మెల్లగా రిలాక్స్‌ అవ్వాలి. ఇలా రెండు, మూడుసార్లు చేయాలి. మొదట్లో వంగడం కష్టమనిపించి చేతులు పాదాలను తాకలేకపోతే కంగారుపడకండి. శరీరం సహకరించినంత వరకే వంగండి. రెండు మూడు రోజుల్లో పూర్తిగా సాధ్యమవుతుంది.

ఇవీ లాభాలు... ఉష్ట్రాసనంవల్ల నెలసరి సరిగా రాకపోవడం, గర్భాశయ కణుతులు (ఫైబ్రాయిడ్స్‌), అండాశయ (పాలిసిస్టిక్‌ ఓవరీస్‌) సమస్యలు, ఎండోమెట్రియాసిస్‌ తదితర గర్భాశయ సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. హార్మోనుల్లో అసమతుల్యత ఉన్న వాళ్లకి, థైరాయిడ్‌ సమస్యలతో బాధపడుతున్న వారిక్కూడా ఈ ఆసనం బాగా ఉపయోగపడుతుంది.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్