నెలసరి సమస్యలకు ఇదో పరిష్కారం!

మనలో కొందరికి నెలసరి ముందుగా లేదా ఆలస్యంగా రావడం, అధిక రక్తస్రావం లాంటి సమస్యలు కనిపిస్తుంటాయి. ఆ సమయంలో పొత్తికడుపులో పోటు, నడుము, తుంటి నొప్పితో అవస్థపడేవారూ ఉన్నారు. వీటికి చెక్‌ పెట్టాలంటే యోని ముద్ర ప్రయత్నించండి.  

Updated : 25 Mar 2023 16:53 IST

మనలో కొందరికి నెలసరి ముందుగా లేదా ఆలస్యంగా రావడం, అధిక రక్తస్రావం లాంటి సమస్యలు కనిపిస్తుంటాయి. ఆ సమయంలో పొత్తికడుపులో పోటు, నడుము, తుంటి నొప్పితో అవస్థపడేవారూ ఉన్నారు. వీటికి చెక్‌ పెట్టాలంటే యోని ముద్ర ప్రయత్నించండి.  

ద్మాసనంలో కానీ, సౌలభ్యంగా అనిపించే మరేదైనా ఆసనంలో కానీ కూర్చోవాలి. వెన్నెముక వంచకుండా నిటారుగా ఉండేలా చూసుకోవాలి. చేతులను సరిగ్గా పొత్తికడుపు వద్ద ఉంచి కళ్లు మూసుకుని కూర్చోవాలి. రెండు చేతుల వేళ్లనూ ఆనించాలి. బొటనవేళ్లు పైకి, చూపుడు వేళ్లు కిందికి, మిగిలిన వేళ్లు మధ్యలోకి ముడవాలి. శ్వాస మీద ధ్యాస ఉంచాలి. గర్భాశయం, అండాశయం, మెడ, ఉదరభాగాల మీద దృష్టి నిలుపుతూ మెల్లగా శ్వాస తీసుకుని వదులుతుండాలి. ఈ ముద్రను ఐదు నుంచి పది నిమిషాలపాటు చేయాలి.

ఇవీ లాభాలు...

స్త్రీలలో సాధారణంగా తలెత్తే అనేక గర్భాశయ సమస్యల నుంచి కాపాడుతుందీ యోని ముద్ర. ఈ సమస్యల్లేని వాళ్లూ ప్రయత్నిస్తే భవిష్యత్తులో ఏ ఇబ్బందీ ఎదురవదు. ఇది హార్మోన్లలో అసమతుల్యతను క్రమబద్ధం చేస్తుంది. గర్భాశయంలో కణుతు (ఫైబ్రాయిడ్స్‌) ల్లాంటి తీవ్ర సమస్యలనూ నివారిస్తుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్