ధనురాసనంతో పీసీఓడీకి చిక్కులకు చెక్‌!

ఇటీవలి కాలంలో కొందరు మహిళలు అండాశయంలో ఇబ్బందులు, గర్భం నిలవకపోవడం లాంటి పీసీఓడీ సమస్యలతో బాధపడుతున్నారు. ధనురాసనం వీటిని నివారిస్తుంది. మందులు వాడితే ఒక్కోసారి ఇతర అనారోగ్యాలకు దారితీయొచ్చు.

Updated : 25 Mar 2023 16:50 IST

ఇటీవలి కాలంలో కొందరు మహిళలు అండాశయంలో ఇబ్బందులు, గర్భం నిలవకపోవడం లాంటి పీసీఓడీ సమస్యలతో బాధపడుతున్నారు. ధనురాసనం వీటిని నివారిస్తుంది. మందులు వాడితే ఒక్కోసారి ఇతర అనారోగ్యాలకు దారితీయొచ్చు. అలాంటి ఇబ్బందులేమీ లేకుండా ఆసనంతో మేలు జరుగుతుందంటే అంతకంటే ఇంకేం కావాలి? వెంటనే ప్రయత్నించండి..

ఎలా చేయాలంటే... బోర్లా పడుకోవాలి. అలా పొట్ట మీద పడుకుని రెండు మోకాళ్లనూ వెనక్కు మడిచి ఉంచాలి. రెండు చేతులనూ వెనక్కి తీసుకెళ్లి కుడిచేత్తో కుడికాలి మడాన్ని, ఎడమచేత్తో ఎడమకాలి మడాన్ని పట్టుకోవాలి. తర్వాత పొట్ట మీద బరువు మోపుతూ పైకి లేవాలి. తొడలు పైకి ఉండాలన్నమాట. అంటే ఈ ఆసనంలో పూర్తిగా పొట్టమీదే ఉంటారు. ఇలా ఉండగలిగినంత సేపు ఉండి, మెల్లగా శ్వాస వదులుతూ యథాస్థితికి వచ్చి, తలను, కాళ్లను కింద పెట్టేయాలి. తర్వాత మెల్లగా శ్వాస తీసుకుంటూ మరోసారి చేయాలి. అలా మూడు నుంచి నాలుగుసార్లు ఈ ఆసనం చేయాలి. మొదట ఎక్కువ క్షణాలు పొట్ట మీద ఉండటం కష్టమనిపించినా.. రానురాను కాస్త ఎక్కువ సమయం ఉండగలుగుతారు. మరీ భారం అనిపించనంతసేపు ఉండాలి.

ఎన్ని ప్రయోజనాలో... పొట్ట దగ్గరున్న కొవ్వు వేగంగా కరిగిపోతుంది. నౌకాసనం, చక్రాసనాల్లానే ధనురాసనం కూడా బాన పొట్టను సైతం కరిగించి ఫ్లాట్‌గా, నాజూగ్గా ఉండేలా చేస్తుంది. అంతే కాకుండా పిరుదులు, చీలమండ కండరాలు ఇలా అన్నీ శక్తివంతంగా తయారవుతాయి. జీర్ణ సంబంధ సమస్యలు ఉన్నవాళ్లు ఈ ఆసనం చేయడం వల్ల లబ్ధి పొందుతారు. నెలసరి ఇబ్బందులు, హార్మోన్ల సమతుల్యత లేకపోవడం లాంటి సమస్యలను నివారిస్తుంది.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్