Manbhar Devi: ఆ భయమే ధైర్యానిచ్చింది

తృటిలో అత్యాచారం నుంచి తప్పించుకుంది. ఆ భయం ఆమెకెప్పటికీ జ్ఞాపకమే! అలా అని భయపడుతూ కూర్చోలేదు మన్భర్‌ దేవి.

Updated : 02 Mar 2023 07:22 IST

తృటిలో అత్యాచారం నుంచి తప్పించుకుంది. ఆ భయం ఆమెకెప్పటికీ జ్ఞాపకమే! అలా అని భయపడుతూ కూర్చోలేదు మన్భర్‌ దేవి. తనలాంటి పరిస్థితి ఎవరికీ రాకూడదు అనుకుంది. ఆత్మరక్షణ విద్యను నేర్చుకొంది. ఊరూరా తిరుగుతూ మహిళలలు, బాలికలకు నేర్పిస్తోంది. బాల్యవివాహాల నిర్మూలనపైనా ప్రచారం చేస్తున్న ఈ 67 ఏళ్ల బామ్మ పోరాటం వెనుక కథ ఇది.

ళ్లతరబడి వేళ్లూనుకుపోయిన సాంఘిక దూరాచారానికి నేనూ బలయ్యాను. దీని వల్ల వచ్చే కష్టాలు, బాధలు అనుభవించిన వారికి మాత్రమే తెలుస్తాయి. నా కథా ఆ కష్టాల నుంచి వచ్చినదే. ఏడేళ్లకే పెళ్లి. 11 ఏళ్లకు అత్తవారింటికి పంపారు. 14 ఏళ్లకు పిల్లలు. ఆడపిల్లను కన్నానని అత్తారింటి వాళ్లు అనని మాటలు లేవు. కొట్టేవారు కూడా. భర్త నుంచి ఎలాంటి సహాయం లేదు. వాటన్నింటిని భరించలేక విసిగిపోయాను. ఇంటి నుంచి బయటికి వచ్చేశాను. అప్పటి వరకు వంటిల్లే ప్రపంచంగా బతికిన నాకు బయటి పరిస్థితులపై అవగాహన శూన్యం. దాంతో ఒక్కసారిగా నా జీవితం పెనం మీద నుంచి పొయ్యిలోకి పడినట్లైంది. చుట్టుపక్కల వాళ్లు భర్త వదిలేసింది అంటూ నిందించేవారు. ఏం చేయాలో దిక్కుతోచని పరిస్థితి. ఉపాధి కోసం ఎక్కని గుమ్మం లేదు. ఒక ఎన్‌జీవో సాయంతో మహిళా హక్కుల కోసం పోరాడుతున్న మమతా జైట్లీని కలిశాను. స్వీపర్‌ ఉద్యోగమైన ఇవ్వాల్సిందిగా ప్రాధేయపడ్డాను. నా పరిస్థితి చూసి ముందు చదువుకోమ్మని సలహా ఇచ్చారామె. ఒక ఎన్జీవోలో చేర్పించారు. పట్టుదలగా 8వ తరగతి వరకు చదివాను.

ఇవి కూడా..

శిక్షణలో అంతర్భాగంగా మహిళలు తరచూ ఎదుర్కొంటున్న భద్రతా ప్రమాణాల మీద అవగాహన కల్పిస్తున్నా. తెలిసిన వారి నుంచి కూడా ముప్పు ఎలా వస్తుందో చెబుతుంటాను. ఎందుకంటే నా కుటుంబం నుంచి నేనూ ఇలాంటి పరిస్థితులే ఎదుర్కొన్నాను. నేను బయటికి వచ్చేయడానికి ప్రధాన కారణం కూడా ఇదే. అందుకే బాల్యవివాహాం పేరు వింటేనే నా రక్తం మరిగిపోతుంటుంది. పాఠశాలలో పిల్లల్ని కలిసే సమయంలో ఇలాంటి సున్నితమైన విషయాలను నిశితంగా వివరిస్తూ వారికీ స్వీయరక్షణ మార్గాలను నేర్పిస్తుంటాను.

తన కథే ఉదాహరణ...

బాల్యవివాహాల వల్ల వచ్చే సమస్యలపైనా అవగాహన కల్పిస్తున్నా.. రాజస్థాన్‌, జయపురలోనే కాకుండా ఇతర రాష్ట్రాల్లోనూ అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నా. అందరికీ నా కథనే ఉదాహరణగా చెబుతుంటాను. బాల్య వివాహం చేసుకుని నేను పడిన బాధలు మరే ఆడపిల్లా పడకూడదని తల్లిదండ్రులకు అవగహన కల్పిస్తుంటాను. అమ్మాయి తల్లిదండ్రులకు భారం కాదు... ఇంటికి మహాలక్ష్మి చదివించి తనకాళ్లమీద తాను నిలబడేట్లు చేయాలన్న సందేశాన్ని దేశ వ్యాప్తంగా ప్రచారం చేస్తున్నాను.

 


అప్పుడే ఈ ఘటన

ఇంటికి వెళ్లే సరికి రాత్రి అయ్యేది. అప్పట్లో మహిళలకు రక్షణ అంతగా ఉండేది కాదు. గస్తీలు ఉండేవి కావు. ఒకరోజు రాత్రి మృగాళ్లా ఆరుగురు మీదపడి బలవంతం చేయడానికి ప్రయత్నించారు. ఆ పెనుగులాట నుంచి ఎలా తప్పించుకున్నానో...  నన్ను నేను ఎలా కాపాడుకున్నానో...  తలచుకుంటేనే ఒళ్లు గగ్గుర్పొడుస్తుంది. అక్కడి నుంచి తప్పించుకున్న తరువాత నాలా ఎంతమంది స్త్రీలు ఇలాంటి పరిస్థితులను ఎదుర్కొంటున్నారో అన్న ఆలోచన నన్ను కలచివేసింది. అప్పుడే మహిళలు శారీరకంగా బలహీనులు కాకూడదని నిర్ణయించుకున్నా. ఆత్మరక్షణ విద్యను నేర్చుకున్నా. మహిళా సంఘాలు, ఎన్జీవోల సహాయంతో పాఠశాలలు, కాలేజీలు, వీధుల్లో మహిళలు, బాలికలకు ఉచిత శిక్షణ ఇచ్చాను. ఇప్పటి వరకు పదివేల మంది విద్యార్థులకు నేర్పించాను.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్