చీరకు వన్నెల సింగారం!

ట్రెండ్‌ని ఫాలో అవ్వాలంటే దుస్తుల డిజైన్‌ మాత్రమే కాదు... వాటి రంగుల ఎంపికా ముఖ్యమే. మనలో కొందరిని ముదురు ఛాయలు మెప్పిస్తే, లేత వర్ణాలు ఇంకొందరి మనసు దోచుకుంటాయి.

Published : 08 Jun 2024 03:24 IST

ట్రెండ్‌ని ఫాలో అవ్వాలంటే దుస్తుల డిజైన్‌ మాత్రమే కాదు ... వాటి రంగుల ఎంపికా ముఖ్యమే. మనలో కొందరిని ముదురు ఛాయలు మెప్పిస్తే, లేత వర్ణాలు ఇంకొందరి మనసు దోచుకుంటాయి. మరికొందరు రెండింటినీ ఇష్టపడినా... తమ ఒంటికి నప్పవేమో అన్న భయంతో వాటిని ఎంచుకోవడానికి వెనకడుగు వేస్తారు. ఇలాంటివారంతా ఇప్పుడు రెండు మూడు రంగులూ ఛాయలూ కలగలిసిపోయేలా డై చేసిన ఓంబ్రే చీరల్ని ఎంచుకోవచ్చు.

మీకు సరిపడని రంగుని కిందవైపునకు వచ్చేలా, దానికి లేత ఛాయనో, కాంబినేషన్‌గా సెట్‌ అయిన మరో కలర్‌నో పై భాగంలో కనిపించేలా చేస్తే చాలు... మనసుకి నచ్చినా పక్కన పెట్టేయాల్సి వచ్చిన చీరల్నీ కట్టి మురిసిపోవచ్చు. ఫ్రెంచ్‌ భాష నుంచి పుట్టిన ఓంబ్రే అనే పదానికి అర్థం ఛాయ. చైనా, జపాన్‌ పురాతన నాగరికతల్లో ఈ తరహా కలర్‌ డైకి ఒకప్పుడు చాలానే ప్రాధాన్యం ఉండేదట. తరవాత కనుమరుగైనా సింథటిక్‌ రంగుల వాడకం మొదలయ్యాక పాశ్చాత్య దుస్తులూ, యాక్సెసరీలపై ఇమిడిపోయి ప్రాచుర్యంలోకి వచ్చింది. తాజాగా కొత్తందాలను అద్దుకుని ఈతరం మగువల మనసుని దోచుకుంటోంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్