ఆయన స్థలం.. నా పేరు మీదకెలా?

పెళ్లై పదేళ్లు. ఎనిమిదేళ్ల పాప. మూడేళ్ల క్రితం మావారు గుండెపోటుతో మరణించారు. మా వారి పేరుమీద ఊళ్లో ఒక స్థలం ఉంది. దాన్ని ఇప్పుడు నా పేరు మీదకి మార్చుకోవాలంటే ఏం చేయాలి? మీవారు ప్రభుత్వ ఉద్యోగం చేశారా? మీకు పెన్షన్‌ వస్తుందా? సాధారణంగా ప్రభుత్వోద్యోగం ఉంటే ఫ్యామిలీ పెన్షన్‌ ఇస్తారు.

Published : 03 Jan 2023 01:04 IST

పెళ్లై పదేళ్లు. ఎనిమిదేళ్ల పాప. మూడేళ్ల క్రితం మావారు గుండెపోటుతో మరణించారు. మా వారి పేరుమీద ఊళ్లో ఒక స్థలం ఉంది. దాన్ని ఇప్పుడు నా పేరు మీదకి మార్చుకోవాలంటే ఏం చేయాలి?

- ఓ సోదరి

మీవారు ప్రభుత్వ ఉద్యోగం చేశారా? మీకు పెన్షన్‌ వస్తుందా? సాధారణంగా ప్రభుత్వోద్యోగం ఉంటే ఫ్యామిలీ పెన్షన్‌ ఇస్తారు. దానికి సంబంధించిన సర్టిఫికెట్‌ రెవెన్యూ ఆఫీసులో ఇస్తారు. మీకు అత్తగారు ఉంటే.. సెక్షన్‌ 8 వారసత్వ చట్టం ప్రకారం మీరు, మీ పాప, అత్తగారు మీవారికి క్లాస్‌-1 వారసులవుతారు. కాబట్టి మీరు లీగల్‌ హెయిర్‌ డిక్లరేషన్‌ సూట్‌ వేసుకోవాలి. అంటే మిమ్మల్ని మీరు వారసులుగా నిరూపించుకోవాలి. అలా నిరూపించుకున్నాక ఆ సర్టిఫికెట్‌తో రెవెన్యూ రికార్డుల్లో మ్యుటేషన్‌ చేయించుకోవాలి. ఈ ప్రక్రియను అనుసరిస్తే భవిష్యత్తులో ఏ ఇబ్బందులూ తలెత్తవు. మంచి లాయర్‌ను కలిసి ప్రక్రియను మొదలుపెట్టండి. ఫ్యామిలీ పెన్షన్‌ సర్టిఫికెట్‌ మీకు లీగల్‌ హెయిర్‌ సూట్‌కి ఆధారంగా ఉపయోగపడుతుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్