ఆభరణాల్లో అమ్మవారు!

టెంపుల్‌ జ్యుయలరీ మనకు తెలిసిందే! దేవతామూర్తుల నమూనాలో తీర్చిదిద్దిన ఈ ఆభరణాలంటే అతివలకెంతో ఇష్టం! అయితే ఈ దసరాకు ప్రత్యేకంగా దుర్గామాత రూపాన్ని పోలి ఉన్న విభిన్న ఆభరణాలు ముస్తాబై మార్కెట్లోకొచ్చేశాయి.

Published : 19 Oct 2023 19:07 IST

టెంపుల్‌ జ్యుయలరీ మనకు తెలిసిందే! దేవతామూర్తుల నమూనాలో తీర్చిదిద్దిన ఈ ఆభరణాలంటే అతివలకెంతో ఇష్టం! అయితే ఈ దసరాకు ప్రత్యేకంగా దుర్గామాత రూపాన్ని పోలి ఉన్న విభిన్న ఆభరణాలు ముస్తాబై మార్కెట్లోకొచ్చేశాయి.

అయితే ఈ కాలపు అమ్మాయిలు అకేషన్ సంప్రదాయబద్ధమైనదే అయినా.. కాస్త మోడ్రన్‌ టచ్‌ ఇవ్వడానికి ఆసక్తి చూపుతున్నారు. ధరించిన దుస్తులకు మ్యాచింగ్‌గా ఉండే ఆర్టిఫిషియల్‌ జ్యుయలరీని ఎంచుకుంటున్నారు. అందుకే అమ్మవారి రూపుతో కూడిన అలాంటి ట్రెండీ నగల్ని ఈసారి మార్కెట్లోకి తీసుకొచ్చారు డిజైనర్లు.

సిల్వర్‌ ఆక్సిడైజ్‌డ్‌, టెర్రాకోటా.. వంటి మెటీరియల్స్‌తో అమ్మవారి వివిధ రూపాలను అందంగా తీర్చిదిద్దిన డిజైనర్లు.. వాటికి ముత్యాలు-రాళ్లు, గవ్వలు, పామ్‌పామ్‌ బాల్స్‌, బీడ్స్‌తో అదనపు హంగులద్దారు. వీటిలోనూ చోకర్‌ నెక్లెస్‌, పొడవాటి చెయిన్‌, పెండెంట్‌, ఇయర్‌రింగ్స్‌.. ఇలా విభిన్న రకాలైన అమ్మవారి నగలు అతివల మనసు దోచుకుంటున్నాయి. పండగ రోజు వేసుకునే దుస్తుల రంగుకు మ్యాచ్‌ అయ్యేలా ఈ నగల్ని ఎంచుకుంటే.. సెంటరాఫ్‌ అట్రాక్షన్‌గా నిలవచ్చు.. అమ్మవారి అనుగ్రహాన్నీ పొందచ్చు.. ఏమంటారు?

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్