మనసుకో ముద్ర!

హార్మోనుల్లో మార్పులు.. గర్భం.. రోజువారీ సమస్యలు చాలవూ మన మనసుని చికాకు పెట్టడానికి! ఒత్తిడి, ఆందోళనలు పెరగడానికి! వీటి నుంచి తప్పించుకోవడానికి యోగాలో మంచి పరిష్కారం ఉంది. మహాకాళేశ్వర ముద్రతో ఆ ఫలితాన్ని పొందేయండి!

Published : 18 Feb 2023 00:14 IST

హార్మోనుల్లో మార్పులు.. గర్భం.. రోజువారీ సమస్యలు చాలవూ మన మనసుని చికాకు పెట్టడానికి! ఒత్తిడి, ఆందోళనలు పెరగడానికి! వీటి నుంచి తప్పించుకోవడానికి యోగాలో మంచి పరిష్కారం ఉంది. మహాకాళేశ్వర ముద్రతో ఆ ఫలితాన్ని పొందేయండి!

ఎలా చేయాలంటే... వజ్రాసనం, పద్మాసనం లేదా సుఖాసనంలో సౌఖ్యంగా ఉండేలా కూర్చోవాలి. రెండు చేతుల ఉంగరం వేలు, చూపుడు వేళ్లను మడవాలి. బొటనవేలు, మధ్యవేలు, చిటికెన వేళ్లను ఒక దానితో ఒకటి కలిపి ఉంచాలి. చేతులు భుజాలకు సమాంతరంగా ఉండాలి. మోచేతులు శరీరానికి తగలకూడదు. కనీసం పది నిమిషాల పాటు ఈ ముద్ర చేయాలి. శరీరాన్ని వంచాల్సిన అవసరం లేదు కనుక ఊబకాయం ఉన్నవాళ్లు, ఏవైనా అనారోగ్యాలతో బాధపడుతు న్నవాళ్లు కూడా ఇది తేలిగ్గా చేయొచ్చు.

ప్రయోజనాలివీ... మహాకాళేశ్వర ముద్రతో ఒత్తిడి, ఆందోళన తగ్గుతాయి. ఒక అలవాటుకు లోనై దాన్ని మానేయాలనుకున్నప్పుడు ఈ ముద్ర పాటిస్తే దాన్నుంచి నెమ్మదిగా బయటకు వచ్చేస్తారు. ఉదయం, సాయంత్రం పది నిమిషాల చొప్పున చేస్తే ఎక్కువ మాట్లాడటం, చిన్న విషయాలకు బాధపడటం, ఊరికే టెన్షన్‌ పడటం, ప్రతి దానికీ కోపం తెచ్చుకోవడం లాంటి లక్షణాలు తగ్గిపోతాయి. బలహీనతలకు బానిసలైన వాళ్లు రోజుకు 24 నిమిషాల చొప్పున 24 రోజులు చేస్తే అందులోంచి బయటకు రావడం తథ్యం. ఏదైనా ఆచరణకు మండలం(40) అనేది ఆదర్శం కదా! కనుక 40రోజులు చేస్తే మానసిక స్థైర్యం చేకూరుతుంది. భవిష్యత్తులో కూడా ఆ అలవాట్ల వైపు దృష్టి మళ్లదు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్