తల్లైన కొత్తల్లో..

అమ్మగా మారిన ప్రతి అమ్మాయి మదిలో ఆ సంతోషం ఎంత ఉంటుందో... సందేహాలు కూడా అన్నే ఉంటాయి. పుట్టిన చిన్నారిని ఎలా ఎత్తుకోవాలి? ఎలా లాలించాలి? పాలెలా పట్టాలి... ఇలా ఆ బిడ్డ ఆలనాపాలనా విషయంలో అనేకానేక ప్రశ్నలు వస్తూ ఉంటాయి...

Updated : 08 Dec 2022 19:16 IST

తల్లైన కొత్తల్లో..

అమ్మగా మారిన ప్రతి అమ్మాయి మదిలో ఆ సంతోషం ఎంత ఉంటుందో... సందేహాలు కూడా అన్నే ఉంటాయి. పుట్టిన చిన్నారిని ఎలా ఎత్తుకోవాలి? ఎలా లాలించాలి? పాలెలా పట్టాలి... ఇలా ఆ బిడ్డ ఆలనాపాలనా విషయంలో అనేకానేక ప్రశ్నలు వస్తూ ఉంటాయి...

ప్రతి ఒక్కరూ కొత్తగా తల్లైన వారికి చాలా జాగ్రత్తలు చెబుతుంటారు. అందులో తమ అనుభవాలనూ జోడిస్తారు. అన్నింటినీ జాగ్రత్తగా వినండి. అందులో అన్నీ కాకపోయినా కొన్ని మీకు ఉపయోగపడొచ్చు.
*పాపాయి రావడానికి ముందు ఇంట్లో వస్తువులూ, పరిసరాలు ఎంతో శుభ్రంగా ఉంటాయి. కానీ ఇప్పుడలా కాదు. వాళ్లకు ఉపయోగించిన న్యాపీలూ, దుస్తులూ, ఆటవస్తువులతో ఇల్లంతా చిందర వందరగా ఉంటుంది. వీటి సంఖ్య పెరుగుతుందే కానీ తగ్గదు. వాటన్నింటినీ ఎప్పటికప్పుడు సర్దుకోవడం కూడా మీ దినచర్యలో భాగం చేసుకోవడం మంచిది. అన్నీ అందుబాటులో పెట్టుకుంటే.. వెతుక్కోవాల్సిన అవసరం ఉండదు.
*పాపాయికి పాలు సరిపోతున్నాయా.. అనే సందేహం మీకు వస్తోంటే ఓసారి వైద్యులతో మాట్లాడండి తప్ప.. అదేపనిగా పాలు పట్టే ప్రయత్నం వద్దు.
*పాపాయి రాకపూర్వం ఇంటి నిర్వహణా, బాధ్యతలను మీరు సమర్థంగా నిర్వహించి ఉండొచ్చు. కానీ పాపాయి పుట్టిన తర్వాత మీకా తీరిక ఉండకపోవచ్చు. పాపాయికి స్నానం చేయించడం, పాలు పట్టడం, డైపర్లు మార్చడం, నిద్రపుచ్చడానికే మీ సమయం సరిపోతుంది. అలాగని ఇంటిని వదిలేయొద్దు. ఓ రెండు మూడు వారాలు గడిచాక ఇంటినీ పట్టించుకోండి. మిగిలిన పనులు పాపాయి పడుకున్నాక చేసుకునేలా ప్రణాళికలు వేసుకోండి.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్