స్వానాసనంతో హార్మోన్ల సమతుల్యత

ఎన్ని జాగ్రత్తలు పాటిస్తూ మితాహారం తీసుకుంటున్నప్పటికీ కొందరికి ఊబకాయం వచ్చేస్తుంటుంది. దానికి ప్రధాన కారణం హార్మోన్ల అపసవ్యత అంటారు ఆరోగ్య నిపుణులు. ఆ సమస్యను నివారించడమే కాకుండా మరెంతో మేలు చేస్తుంది స్వానాసనం. మరి ఈ ఆసనం వేసి ఆరోగ్యాన్ని సొంతం చేసుకుందామా...

Updated : 25 Mar 2023 16:54 IST

న్ని జాగ్రత్తలు పాటిస్తూ మితాహారం తీసుకుంటున్నప్పటికీ కొందరికి ఊబకాయం వచ్చేస్తుంటుంది. దానికి ప్రధాన కారణం హార్మోన్ల అపసవ్యత అంటారు ఆరోగ్య నిపుణులు. ఆ సమస్యను నివారించడమే కాకుండా మరెంతో మేలు చేస్తుంది స్వానాసనం. మరి ఈ ఆసనం వేసి ఆరోగ్యాన్ని సొంతం చేసుకుందామా...

ఎలా చేయాలంటే... బోర్లా పడుకుని రెండు చేతులనూ నడుముకు రెండువైపులా దగ్గరగా పెట్టుకోవాలి. చేతుల మీద బరువు వేస్తూ మెల్లగా వీలైనంత పైకి లేవాలి.  ఫొటోలో చూపిన విధంగా మోకాళ్లు కూడా నేలను తాకకుండా పైకి లేపి ఉంచాలి. బరువంతా కాలివేళ్లు, అరచేతులు, మణికట్టు మీద పడుతుంది కనుక ఈ భంగిమ కొంచెం కష్టమైనదే. కానీ కొన్ని రోజులు ప్రాక్టీస్‌ చేసిన తర్వాత తేలికవుతుంది.

ఇవీ ప్రయోజనాలు...

స్వానాసనం వల్ల రక్త సరఫరా సవ్యంగా ఉంటుంది. ముఖ్యంగా మెదడుకు రక్తం వేగంగా చేరుతుంది. కండరాలు బలోపేతం అవుతాయి. కాళ్లూ, చేతులూ, భుజాలూ దృఢత్వాన్ని సంతరించుకుంటాయి.

నడుం కింది భాగంలో నొప్పి రాదు. తిమ్మిర్లు, నీరసం లాంటి లక్షణాల కార్పల్‌ టన్నెల్‌ సిండ్రోమ్‌ను అరికడుతుంది.

పొట్ట కింది నుంచి పై వరకూ వంచుతాం కనుక మంచి వ్యాయామం. ఒత్తిడి, ఆందోళన తగ్గుతాయి.

హార్మోన్ల అపసవ్యతను క్రమబద్ధం చేస్తుంది. బరువు తగ్గుతారు. భవిష్యత్తులోనూ ఊబకాయం రాదు. థైరాయిడ్‌ సమస్య, ఇన్సులిన్‌ స్థాయి హెచ్చుతగ్గులు, అండాశయాల్లో (ఓవరీస్‌) సమస్య ఇలా అన్నిటికీ మంచిది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్