పిల్లలు చురుగ్గా ఉండాలంటే..

పిల్లలు ఎదుగుతున్న క్రమంలో వారి ఆసక్తులు, అభిరుచులను గుర్తించి ప్రోత్సహించాల్సిన బాధ్యత తల్లిదండ్రులదే. నిరంతరం కొత్త విషయాలు నేర్చుకుంటే చిన్నారులు చురుగ్గా మారతారు. అందుకేం చేయాలంటే....

Published : 05 Nov 2022 15:57 IST

పిల్లలు ఎదుగుతున్న క్రమంలో వారి ఆసక్తులు, అభిరుచులను గుర్తించి ప్రోత్సహించాల్సిన బాధ్యత తల్లిదండ్రులదే. నిరంతరం కొత్త విషయాలు నేర్చుకుంటే చిన్నారులు చురుగ్గా మారతారు. అందుకేం చేయాలంటే..

బందీ చేయద్దు..

చాలామంది తల్లిదండ్రులు పిల్లల చేతులకు కనీసం మట్టి అంటకుండా పెంచుతుంటారు. బయటకు వెళ్లొద్దని నియమాలు పెడుతుంటారు. దీంతో వారు నాలుగు గోడల మధ్య ఉండి.. నిస్సత్తువగా, బద్ధకంగా మారే అవకాశం ఉంది. ఇలా కాకుండా వారిని ఆరు బయట, చుట్టుపక్కల పిల్లలతో ఆడుకోమని ప్రోత్సహించాలి. శారీరక శ్రమ ఉంటేనే పిల్లలు ఉత్సాహంగా ఉంటారు. ఎవరితో ఎలా ప్రవర్తించాలనేది తెలుస్తుంది.

ఓపిగ్గా..

అప్పుడప్పుడే బయటి ప్రపంచాన్ని చూస్తున్న పిల్లలు అనేక రకాల ప్రశ్నలు అడుగుతుంటారు. ఆ సమయంలో వారిని విసుక్కోకుండా అడిగిన ప్రశ్నలకు ఓపిగ్గా సమాధానాలు చెప్పాలి. ఇలా చేస్తేనే వారిలో ఊహాశక్తి, విశ్లేషణా సామర్థ్యాలు మెరుగుపడతాయి.

ప్రకృతిలో..

ఖాళీ సమయాల్లో పిల్లలను పార్కులు, పంట పొలాలు, తోటలకు తీసుకెళ్తే.. ప్రకృతిపై అవగాహన పెరిగే అవకాశం ఉంటుంది. మొక్కలు, చెట్ల రకాలు, అవి పెరిగే విధానం, ఫలాల గురించి చెప్పాలి. కొత్త విషయాలు నేర్చుకోవాలనే ఆసక్తిని పెంచాలి.

ఇవి అలవాటు చేయాలి..

పజిల్స్ పూరించడం, రూబిక్స్ క్యూబ్ సాల్వ్ చేయడం.. వంటి వ్యాపకాలను పిల్లలకు అలవాటు చేయాలి. వీటి ద్వారా మెదడు పనితీరు మెరుగుపడుతుంది. ఇవి వారి మానసిక ఎదుగుదలకు దోహదం చేస్తాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్