ఆమ్లెట్‌.. కోరినట్లుగా..!

ఉడికించిన కోడిగుడ్డును ఇష్టపడకపోయినా.. ఆమ్లెట్‌ వేస్తే పిల్లలు యమ్మీగా లాగించేస్తారు. మరి, ఎప్పుడూ గుండ్రంగానే కాకుండా.. దాన్నీ వివిధ ఆకృతుల్లో వేసి అందిస్తే.. ఇంకా కావాలంటారు. ఇలా పిల్లల మనసు దోచుకునే విభిన్న ఎగ్‌ ఆమ్లెట్‌ మౌల్డ్స్‌ ప్రస్తుతం మార్కెట్లో బోలెడున్నాయి....

Published : 22 Jan 2023 13:08 IST

ఉడికించిన కోడిగుడ్డును ఇష్టపడకపోయినా.. ఆమ్లెట్‌ వేస్తే పిల్లలు యమ్మీగా లాగించేస్తారు. మరి, ఎప్పుడూ గుండ్రంగానే కాకుండా.. దాన్నీ వివిధ ఆకృతుల్లో వేసి అందిస్తే.. ఇంకా కావాలంటారు. ఇలా పిల్లల మనసు దోచుకునే విభిన్న ఎగ్‌ ఆమ్లెట్‌ మౌల్డ్స్‌ ప్రస్తుతం మార్కెట్లో బోలెడున్నాయి.

స్టార్‌, ఫ్లవర్‌, హార్ట్‌, కార్టూన్‌ షేప్‌, వివిధ రకాల జంతువులు-పండ్లు-పక్షులు.. వంటి ఆకృతుల్లో తయారైన ఈ అచ్చుల్ని నేరుగా ప్యాన్‌పై పెట్టి.. పగలగొట్టిన గుడ్డును అందులో పోస్తే సరి..! కావాలంటే దీనిపై నుంచి ఉప్పు, కారం, మిరియాల పొడి, కొత్తిమీర తరుగు.. వంటివి చల్లుకోవచ్చు.. లేదంటే అలానే తినేయచ్చు.. ఇలా పిల్లలు మెచ్చే ఆకృతిలో ఎగ్‌ ఆమ్లెట్‌ క్షణాల్లోనే తయారైపోతుంది. పిల్లలు కావాలంటే ఇదే పద్ధతిలో బ్రెడ్‌ ఆమ్లెట్‌ కూడా తయారుచేసి ఇవ్వచ్చు. ఇక ఈ ఆమ్లెట్‌ మౌల్డ్స్‌ అల్యూమినియం, స్టీలు, సిలికాన్‌.. వంటి మెటీరియల్స్‌తో తయారు చేయడం వల్ల వేడి తగిలినా అవి కరిగిపోయే ప్రమాదం ఉండదు. ఇలాంటి ఆమ్లెట్‌ అచ్చులతో పాటు విభిన్న ఆకృతుల్లో రూపొందిన ఆమ్లెట్‌ ప్యాన్స్‌ కూడా ప్రస్తుతం మార్కెట్లో దొరుకుతున్నాయి. మరి, వాటిపై మీరూ ఓ లుక్కేయండి!

Photos: Amazon.in

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్