జీన్స్‌ వదులైందా?

నడుం కొలత ఎంత కచ్చితంగా చూసి ఎంచుకున్నా, ట్రై చేసి తీసుకున్నా.. ఒక్కోసారి జీన్స్‌ కాస్త వదులవుతుంటుంది. బరువు తగ్గి సన్నబడిన వారిలోనూ ఈ సమస్య తలెత్తుతుంది. అలాగని బెల్టుతో బిగించేస్తే ముడతలు పడినట్లుగా ఎబ్బెట్టుగా కనిపిస్తుంది. అలా జరగకుండా ఉండాలంటే ‘జీన్స్ అడ్జస్టబుల్‌ పిన్స్‌’ను ఎంచుకోవాల్సిందే!

Published : 14 Sep 2023 12:41 IST

నడుం కొలత ఎంత కచ్చితంగా చూసి ఎంచుకున్నా, ట్రై చేసి తీసుకున్నా.. ఒక్కోసారి జీన్స్‌ కాస్త వదులవుతుంటుంది. బరువు తగ్గి సన్నబడిన వారిలోనూ ఈ సమస్య తలెత్తుతుంది. అలాగని బెల్టుతో బిగించేస్తే ముడతలు పడినట్లుగా ఎబ్బెట్టుగా కనిపిస్తుంది. అలా జరగకుండా ఉండాలంటే ‘జీన్స్ అడ్జస్టబుల్‌ పిన్స్‌’ను ఎంచుకోవాల్సిందే!

హుక్స్‌ మాదిరిగా ఉండే ఇవి ప్రస్తుతం విభిన్న డిజైన్లలో అందుబాటులో ఉన్నాయి. బటన్స్‌, స్టోన్స్‌, ముత్యాలు, కుందన్స్‌, సీతాకోకచిలుకలు, టెడ్డీబేర్‌ వంటి బొమ్మలు, కుందేళ్లు, వింటేజ్‌ మోడల్‌లో ఉన్నవీ దొరుకుతున్నాయి. రెండు విడి భాగాలుగా ఉండే వీటిని స్క్రూతో జీన్స్‌ వదులుగా ఉన్న చోట, ఎంత బిగుతుగా కావాలంటే అంత దూరంలో బిగించుకోవాల్సి ఉంటుంది. ఆపై హుక్‌ మాదిరిగా బిగిస్తే.. కనీ కనిపించకుండానే జీన్స్‌ ఫిట్‌గా మారిపోతుంది. పైగా ఇవి జీన్స్‌కి అదనపు అందాన్నీ తీసుకొస్తాయి కూడా! అయితే వీటిని కేవలం జీన్స్‌ కోసమే కాకుండా.. స్కర్ట్స్‌, క్రాప్‌టాప్స్‌, బ్లౌజులు.. వంటి వాటిని ఫిట్‌గా చేసుకోవడానికీ ఉపయోగించుకోవచ్చు. అలాంటి జీన్స్ అడ్జస్టబుల్ పిన్సే ఇవి!

Photos: Amazon.in

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్