Potty Bottle : ప్రయాణాల్లో పిల్లల కోసం..!

దూర ప్రయాణాలనగానే మనం ఒక విషయంలో సందేహిస్తుంటాం.. టాయిలెట్‌ సదుపాయాలు ఎక్కడుంటాయో? ఎలా ఉంటాయో? అని! ఎక్కువగా బస్సుల్లో ప్రయాణించేటప్పుడే ఇలాంటి అసౌకర్యం ఎదురవుతుంటుంది.

Published : 05 Dec 2023 13:15 IST

దూర ప్రయాణాలనగానే మనం ఒక విషయంలో సందేహిస్తుంటాం.. టాయిలెట్‌ సదుపాయాలు ఎక్కడుంటాయో? ఎలా ఉంటాయో? అని! ఎక్కువగా బస్సుల్లో ప్రయాణించేటప్పుడే ఇలాంటి అసౌకర్యం ఎదురవుతుంటుంది. పిల్లల్ని వెంట పెట్టుకెళ్లినా ఇలాంటి సమస్యే వస్తుంటుంది. అలాగని వాళ్ల కోసం ప్రతిసారీ వాహనాన్ని ఆపమనలేం. అయితే ఇలాంటి సమయంలో చిన్న పిల్లలకైతే డైపర్లు వేయచ్చు.. కానీ కాస్త పెద్ద పిల్లలైతే? అలాంటి వారి కోసమే ప్రస్తుతం ‘పాటీ బాటిల్స్‌’ అందుబాటులోకి వచ్చాయి.

పేరుకు తగ్గట్లే పొడవాటి బాటిల్‌ లేదా మొక్కలకు నీళ్లు పోసే వాటరింగ్‌ క్యాన్‌, అవసరాన్ని బట్టి ఫోల్డబుల్‌, ఎక్స్‌పాండబుల్‌ చేసుకునే విధంగా.. ఇలా విభిన్న ఆకృతుల్లో ఇవి దొరుకుతున్నాయి. వీటికి గొట్టం లేదా వెడల్పాటి రంధ్రం ఉండే క్యాప్‌ అమరి ఉంటుంది. అమ్మాయిల కోసం ప్రత్యేకంగా, అబ్బాయిల కోసం సెపరేట్‌గా.. ఇలా విడివిడిగా మూతలున్న బాటిల్స్‌ దొరుకుతున్నాయి. లేదంటే రెండూ ఒకే దాంట్లో అమరి ఉన్న డ్యూయల్‌ క్యాప్స్‌తో కూడిన బాటిల్స్‌ కూడా అందుబాటులో ఉన్నాయి. ప్రయాణాల్లో వీటిని ఉపయోగించాక మూత బిగించుకుంటే సరి.. లీకేజీ సమస్య కూడా ఉండదు. అవసరం తీరాక వీటిని వేడి నీళ్లతో శుభ్రం చేసుకొని.. ఎండలో ఆరబెట్టుకోవాలి. ఇలా ప్రయాణాల్లో పిల్లలకు సౌకర్యవంతంగా ఉండే ఈ వెరైటీ పాటీ బాటిల్స్‌పై మీరూ ఓ లుక్కేసేయండి మరి!

Photos: Amazon.in

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్