Samantha: పెళ్లి గౌనుని రీసైక్లింగ్ చేయించా.. ఇదంటే ఎంతో ఇష్టం!

తాము చేసే ప్రతి పనిలోనూ పర్యావరణహితాన్ని కోరుకుంటారు కొందరు. ఆఖరికి ధరించే దుస్తుల విషయంలోనూ! ఈ క్రమంలోనే పాత దుస్తుల్ని రీసైక్లింగ్‌ చేయించుకొని స్టైలిష్‌గా మెరిసిపోతుంటారు.. తద్వారా పర్యావరణాన్నీ కాపాడుతుంటారు.

Published : 27 Apr 2024 12:58 IST

(Photos: Instagram)

తాము చేసే ప్రతి పనిలోనూ పర్యావరణహితాన్ని కోరుకుంటారు కొందరు. ఆఖరికి ధరించే దుస్తుల విషయంలోనూ! ఈ క్రమంలోనే పాత దుస్తుల్ని రీసైక్లింగ్‌ చేయించుకొని స్టైలిష్‌గా మెరిసిపోతుంటారు.. తద్వారా పర్యావరణాన్నీ కాపాడుతుంటారు. టాలీవుడ్‌ నటి సమంత కూడా అదే చేసింది. తన పెళ్లి గౌన్‌ని రీసైక్లింగ్‌/రీమోడలింగ్‌ చేయించుకొని కొత్త హంగులద్దింది. ఇటీవలే ఓ అవార్డుల ఫంక్షన్‌లో భాగంగా ఈ సస్టెయినబుల్‌ గౌన్‌ని ధరించి మెరిసిపోయిన ఈ ముద్దుగుమ్మ.. ఈ గౌన్‌ విశేషాల్ని తాజాగా ఇన్‌స్టాలో పంచుకుంది. దీంతో ఈ గౌన్‌ ఫొటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి. ‘నాకున్న మంచి అలవాట్లలో సస్టెయినబిలిటీ ఒకటి..’ అంటోన్న సామ్‌.. ఇప్పుడే కాదు.. గతంలోనూ పలుమార్లు రీసైక్లింగ్‌ ఫ్యాషన్‌ని పాటిస్తూ ఈతరం అమ్మాయిలకు ఎకో ఫ్యాషన్‌ పాఠాలు నేర్పింది.

2017లో నాగచైతన్యతో సమంత ఏడడుగులు నడిచిన సంగతి తెలిసిందే. ఆపై పలు వ్యక్తిగత కారణాల రీత్యా 2021లో వీరిద్దరూ విడాకులు తీసుకున్నారు. ఇక తన వివాహంలో భాగంగా క్రిస్టియన్‌ సంప్రదాయాల ప్రకారం జరిగిన పెళ్లిలో సామ్‌ తెలుపు రంగు వెడ్డింగ్‌ గౌన్‌లో దేవకన్యలా మెరిసిపోయింది. అయితే ఈ గౌన్‌ను ఇటీవలే రీసైక్లింగ్‌ చేయించుకున్న ఈ ముద్దుగుమ్మ.. ‘ఎల్లే సస్టెయినబిలిటీ అవార్డు’ల్లో భాగంగా దీన్ని ధరించింది. ఇక ఈ వేడుకలో సామ్‌.. ‘స్పెషల్‌ లీడర్స్‌ ఆఫ్‌ ఛేంజ్‌ (ఫీమేల్‌)’ అవార్డు గెలుచుకుంది.

సస్టెయినబిలిటీకే నా ఓటు!

అయితే ఈ గౌన్‌ ఫొటోల్ని తాజాగా ఇన్‌స్టాలో పంచుకున్న సామ్‌.. ‘సస్టెయినబిలిటీని నేనెప్పుడూ మర్చిపోను. ఎల్లప్పుడూ ఇదే నా ఛాయిస్‌. ఈ అలవాటు పర్యావరణ పరిరక్షణకు మేలు చేస్తుంది. నేను ధరించిన ఈ గౌన్‌ అంటే నాకు చాలా ఇష్టం. పర్యావరణ పరిరక్షణలో భాగంగానే రీసైక్లింగ్‌ చేయించి ఈ గౌన్‌ని తయారుచేయించుకున్నా. నా అలవాట్లు, జీవనశైలి ఎప్పుడూ పర్యావరణహితంగా ఉండాలని నేను కోరుకుంటా. పాత దుస్తుల్ని రీసైక్లింగ్‌ చేయించడమూ ఇందులో ఓ భాగమే!’ అంటూ రాసుకొచ్చింది.

ప్రముఖ డిజైనర్‌ క్రేశా బజాజ్‌ రూపొందించిన ఈ నలుపు రంగు గౌన్‌ మేకింగ్‌ వీడియోను డిజైనర్‌ తన ఇన్‌స్టాలో పోస్ట్‌ చేశారు. ‘గౌన్‌ రీసైక్లింగ్‌లో భాగంగా సమంతతో కలిసి పనిచేయడం, పరోక్షంగా పర్యావరణ పరిరక్షణలో పాలుపంచుకోవడం సంతోషంగా ఉంది..’ అంటూ రాసుకొచ్చారు. ప్రస్తుతం ఈ నలుపు రంగు స్ట్రాప్‌లెస్‌ బాడీ హగ్గింగ్‌ గౌన్‌ ఫొటోలు, మేకింగ్‌ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి. దీంతో ‘ఈ గౌన్‌లో సామ్‌ స్టన్నింగ్‌గా ఉందం’టూ నెటిజన్లు పోస్టులు పెడుతున్నారు.


ఎకో-ఫ్యాషన్‌ పాఠాలు!

ఇలా ఇప్పుడే కాదు.. గతంలోనూ పలుమార్లు సస్టెయినబుల్‌ ఫ్యాషన్‌ని అనుసరిస్తూ మెరిసిపోయింది సామ్.

⚛ తన ఫ్యాన్స్‌కి పర్యావరణ పరిరక్షణపై అవగాహన కల్పించే ముఖ్యోద్దేశంతో ఓ సందర్భంలో తెలుపు రంగు గౌన్‌ని ధరించిందామె. షీర్‌ హెమ్‌తో హంగులద్దిన ఈ గౌన్‌లో దేవకన్యలా కనిపించింది. చేత్తో రూపొందించిన ఈ గౌన్‌ని ‘ఎకా డిజైన్‌ హౌస్‌’ నుంచి ఎంచుకుందామె.

⚛ ఇక మరో సందర్భంలో ప్రముఖ డిజైనర్‌ శిల్పా రెడ్డి విసిరిన #mysustainstory అనే సోషల్‌ మీడియా ఛాలెంజ్‌లో పాల్గొని.. బ్లాక్‌ అండ్‌ వైట్‌ టీషర్ట్‌, స్ట్రైప్‌డ్‌ ప్యాంట్స్‌ ధరించి తళుక్కుమంది సమంత. ఇదీ అప్‌సైక్లింగ్‌ చేసిన అవుట్‌ఫిటే. ‘రసాయనాలేవీ ఉపయోగించకుండా సహజసిద్ధమైన రంగులతోనే ఈ డ్రస్‌కు హంగులద్దారు. ఇలాంటి సస్టెయినబుల్‌ దుస్తులే మనకు పర్యావరణ పరిరక్షణ పాఠాలు నేర్పుతాయి..’ అందీ చక్కనమ్మ.

⚛ ‘సామ్‌జామ్’ టాక్‌ షో ప్రారంభోత్సవం కోసం డిజైనర్‌ ద్వయం పంకజ్‌-నిధి రూపొందించిన కాన్వా ఫ్లూయిడ్‌ మ్యాక్సీ డ్రస్‌ ధరించింది సమంత. రీసైక్లింగ్‌ చేసిన ప్లాస్టిక్‌ బాటిళ్లతో దీన్ని రూపొందించారు. పసుపు, బ్లూ, గ్రే, పీచ్‌.. వంటి రంగులతో హంగులద్దిన ఈ మల్టీ కలర్‌ డ్రస్‌లో మరోసారి తన ఎకో-ఫ్యాషన్‌ సెన్స్‌ను చాటుకుంది సామ్.

ఇలా అటు తన జీవనశైలితో పాటు ఇటు తన ఫ్యాషన్ల ఎంపికతోనూ పర్యావరణ పరిరక్షణపై అందరిలో అవగాహన పెంచుతోందీ టాలీవుడ్‌ బేబ్.



Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్