పొట్ట ఇట్టే తగ్గిపోతుంది

కాన్పు అయ్యాక చాలామంది స్త్రీలకి పొట్ట వచ్చేస్తుంది. తిండి విషయంలో ఎంత జాగ్రత్తగా ఉన్నా అది తప్పడం లేదని బాధపడుతుంటారు. కొందరు పెళ్లి కాని అమ్మాయిలు కూడా తమకు చిరుబొజ్జ వస్తోందని వాపోతున్నారు. అందానికి ఆటంకం కలిగించే ఈ పొట్టను ఎలా తగ్గించుకోవాలని తల పట్టుకుంటున్నారా? మరేం ఆలోచించకుండా నౌకాసనం వేసి సత్వర ఫలితం పొందండి.

Updated : 25 Mar 2023 16:52 IST

కాన్పు అయ్యాక చాలామంది స్త్రీలకి పొట్ట వచ్చేస్తుంది. తిండి విషయంలో ఎంత జాగ్రత్తగా ఉన్నా అది తప్పడం లేదని బాధపడుతుంటారు. కొందరు పెళ్లి కాని అమ్మాయిలు కూడా తమకు చిరుబొజ్జ వస్తోందని వాపోతున్నారు. అందానికి ఆటంకం కలిగించే ఈ పొట్టను ఎలా తగ్గించుకోవాలని తల పట్టుకుంటున్నారా? మరేం ఆలోచించకుండా నౌకాసనం వేసి సత్వర ఫలితం పొందండి.

ఎలా చేయాలంటే...

నౌకను తలపించేలా ఉంటుందీ ఆసనం. కింద కూర్చుని కాళ్లు ముందుకు చాపాలి. తొడల దగ్గర చేతులతో పట్టుకుని కాళ్లను పైకి లేపి పిరుదుల మీద బ్యాలెన్స్‌ చేస్తూ శరీరాన్ని కొంచెం వెనక్కి వంచాలి. మెల్లగా రెండు చేతులను మోకాళ్ల దగ్గర పట్టుకుని కాళ్లను ఇంకాస్త పైకి లేపి అవి తలకి సమాంతరంగా ఉండేలా చూడాలి. మోకాళ్లను వంచకూడదు. పాదాలు తల కంటే ఎత్తుకు వెళ్లకూడదు. మెల్లగా రెండు చేతులనూ తీసేసి కాళ్లను అలా గాల్లోకి ఉంచాలి. చేతులను ముందుకు చాచాలి. శరీర బరువంతా పిరుదుల మీద ఉంటుంది. ఇలా హిప్స్‌ మీద బరువు నిలుపుతూ ఆనక నెమ్మదిగా కాళ్లను కిందికి దించాలి. సుమారుగా పది నుంచి ఇరవై క్షణాల పాటు ఆ భంగిమలో ఉండాలి. కొన్ని రోజుల తర్వాత ఇరవై నుంచి 30 క్షణాల పాటు అలా నిలపగలుగుతారు. చిన్న విరామాలతో మూడు లేదా నాలుగు సార్లు ఈ ఆసనం వేేయాలి.

ఎవరు చేయకూడదు...

ఉబ్బసం, హృద్రోగాలు, లోబీపీ, తీవ్ర తలనొప్పి, వెన్నెముక అపసవ్యతలు ఉన్నవాళ్లు నౌకాసనం చేయకూడదు.

నెలసరి సమయంలో మొదటి రెండు రోజులు ఈ ఆసనం జోలికి వెళ్లకూడదు. అలాగే గర్భిణులు చేయకూడదు.

ఎన్ని ప్రయోజనాలో...

కాళ్లూ చేతులూ, తొడలూ పిరుదులూ, భుజాలూ, మెడ దృఢంగా తయారవుతాయి.

అరగకపోవడం లాంటి జీర్ణ ప్రక్రియ సంబంధిత ఇబ్బందులు సమసి పోతాయి.

పొట్ట భాగంలోని కండరాలు బలం పుంజుకుంటాయి. మలబద్ధక సమస్య తలెత్తదు.

కడుపుబ్బరం నుంచి బయటపడొచ్చు.

పొట్ట దగ్గర పేరుకున్న కొవ్వు వేగంగా తగ్గిపోతుంది.

వెన్నెముక దృఢత్వాన్ని సంతరించుకుంటుంది, నడుం నొప్పి రాదు.

రక్త సరఫరా సవ్యంగా సాగుతుంది.

అగ్నాశయం (పాంక్రియాస్‌), మూత్రపిండాలు, కాలేయం ఉత్తేజితమవుతాయి.

థైరాయిడ్‌ సమస్య ఉన్నవారికి ఉపశమనం కలుగుతుంది.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్