క్యాప్‌ విగ్‌.. మీరూ ట్రై చేస్తారా?

కర్లీ హెయిర్‌ ఉన్న వాళ్లు సిల్కీ హెయిర్‌ కావాలని, సిల్కీ జుట్టున్న వారు ఉంగరాల జుట్టు కోరుకోవడం సహజం. ఈ క్రమంలో కర్లర్‌, స్ట్రెయిట్‌నర్‌.. వంటి బ్యూటీ పరికరాలు ఉపయోగిస్తుంటారు. నిజానికి వీటి వల్ల జుట్టు ఆరోగ్యం దెబ్బతింటుంది.

Published : 07 Dec 2023 12:48 IST

కర్లీ హెయిర్‌ ఉన్న వాళ్లు సిల్కీ హెయిర్‌ కావాలని, సిల్కీ జుట్టున్న వారు ఉంగరాల జుట్టు కోరుకోవడం సహజం. ఈ క్రమంలో కర్లర్‌, స్ట్రెయిట్‌నర్‌.. వంటి బ్యూటీ పరికరాలు ఉపయోగిస్తుంటారు. నిజానికి వీటి వల్ల జుట్టు ఆరోగ్యం దెబ్బతింటుంది. ఇదిలా ఉంటే.. పొడవాటి జుట్టున్న వారు పొట్టిగా కత్తిరించుకోవడం, పొట్టి జుట్టు ఉన్న వారు పొడవాటి జుట్టు కోరుకోవడమూ పరిపాటే! అయితే ఈ సమస్యలేవీ లేకుండా.. మనం కోరుకున్నట్లుగా కేశాలంకరణ చేసుకోవడానికి వీలుగా ప్రస్తుతం మార్కెట్లో ‘క్యాప్‌ విగ్స్‌’ దొరుకుతున్నాయి.

‘హెయిర్‌ ఎక్స్‌టెన్షన్‌ బేస్‌బాల్‌ క్యాప్‌’గానూ పిలిచే ఈ విగ్స్‌లో.. పొడవుగా, పొట్టిగా, బాబ్‌ హెయిర్‌స్టైల్‌ మాదిరిగా, సిల్కీగా, కర్లీగా, వివిధ రకాల హెయిర్‌స్టైల్స్‌ చేసినట్లుగా.. ఇలా విభిన్న స్టైల్స్‌లో ఉన్నవి దొరుకుతున్నాయి. పేరుకు తగినట్లే ఈ విగ్స్‌ క్యాప్‌కు అనుసంధానమై ఉంటాయి. నచ్చిన, మీకు నప్పిన హెయిర్‌స్టైల్‌ ఉన్న క్యాప్‌ విగ్‌ను ఎంచుకుంటే సరి.. మీకు కావాల్సినప్పుడల్లా.. మీ జుట్టును పైకి ముడేసుకొని.. ఈ క్యాప్‌ విగ్‌ పెట్టేసుకోవచ్చు. ఇక ఈ కాలపు అమ్మాయిల అభిరుచులకు తగినట్లుగా విభిన్న హెయిర్‌ కలర్స్‌లో రూపొందించిన క్యాప్‌ విగ్స్‌ కూడా ప్రస్తుతం మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. ముఖ్యంగా ఈ క్యాప్‌ విగ్స్‌ జీన్స్‌, బాడీ హగ్గింగ్‌ డ్రసెస్‌, ఫ్రాక్స్‌, జంప్‌సూట్స్‌.. వంటి వెస్టర్న్‌ వేర్‌పైకి బాగా నప్పుతాయి. ఇలాంటి క్యాప్‌ విగ్స్‌పై మీరూ ఓ లుక్కేసేయండి మరి!

Photos: Amazon.in

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్