ఆ మాటల్ని అవమానంగా తీసుకోలేదు!

నా పేరు వినగానే ‘విజయవంతమైన మహిళ’ అనేస్తారు కదా! నా కెరియర్‌ ప్రారంభం కాకముందు.. మా ప్రొఫెసర్‌ నాతో ‘నువ్వో చెత్త ఇంజినీర్‌ కాగలవని నీకు తెలుసా? బదులుగా మేనేజ్‌మెంట్‌ ఎంచుకోరాదు.. నీ మనస్తత్వానికి అదే సరైనది’ అన్నారు.

Updated : 24 Dec 2022 08:48 IST

అనుభవపాఠం

నా పేరు వినగానే ‘విజయవంతమైన మహిళ’ అనేస్తారు కదా! నా కెరియర్‌ ప్రారంభం కాకముందు.. మా ప్రొఫెసర్‌ నాతో ‘నువ్వో చెత్త ఇంజినీర్‌ కాగలవని నీకు తెలుసా? బదులుగా మేనేజ్‌మెంట్‌ ఎంచుకోరాదు.. నీ మనస్తత్వానికి అదే సరైనది’ అన్నారు. నొచ్చుకున్న మాట నిజమే.. కానీ దాన్ని అవమానంగా తీసుకోలేదు. సలహాగా భావించి ఎంబీఏ చేశా. పూర్తవగానే హిందుస్థాన్‌ యునిలివర్‌లో ట్రైనీగా ఉద్యోగమొచ్చింది. మరి ఈ స్థాయి వరకూ ఎలా చేరగలిగానంటారా? మనం పనిచేసే విభాగం వరకూ తెలిస్తే సరిపోదు. మూలాలు తెలుసుకోవాలి. అందుకే యునిలివర్‌ ఫ్యాక్టరీకి వెళ్లి సబ్బుల తయారీ నేర్చుకున్నా. రాత్రివేళల్లోనూ పనిచేశా. అలా పనిచేసిన మొదటి మహిళనీ నేనే. అక్కడే ప్రొడక్షన్‌, వివిధ విభాగాల పనితీరు ముఖ్యంగా ఎలాంటి స్థితిలోనైనా తట్టుకొని నిలబడే తీరు వంటి గొప్ప పాఠాలను నేర్చుకున్నా. ప్రతి సంస్థలాగే నా దగ్గరికీ చాలా ఫీడ్‌బ్యాక్‌లు వచ్చేవి. వాటిని చూస్తే నా శ్రమంతా వృథా అయ్యిందన్న భావన కలిగేది. అందుకే పెద్దగా పట్టించుకునేదాన్ని కాదు. కానీ ఒకతను ‘నీపై నమ్మకం ఉన్నవాళ్లే సలహాలిస్తారు, నీ పొరపాట్లు నీకే చెబుతారు. నీ గురించి పట్టించుకోని వాళ్లు నువ్వెలా చేస్తే ఏంటని వదిలేస్తారు’ అన్నాడు. అప్పట్నుంచి ఫీడ్‌బ్యాక్‌ను సీరియస్‌గా తీసుకోవడం మొదలుపెట్టా. ఇవే నన్నీ స్థితిలో నిలబెట్టాయి. మీకు తగినదేదో, ఆనందాన్నిచ్చేదేదో తెలుసుకోండి. ఆ రంగంలో మూలాల నుంచి ప్రతి చిన్న విషయాన్నీ తెలుసుకోండి. కెరియర్‌ ప్రారంభంలో ఎంతటి కష్టానికైనా సిద్ధమవండి. సలహాలు, సూచనలు తీసుకోవడానికి ఎప్పుడూ ముందు ఉండండి. ఒక దశ తర్వాత మీ వృత్తి జీవితం నల్లేరు మీద నడకే!

- లీనా నాయర్‌, సీఈఓ, ఛానెల్‌

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్