ఎండాకాలం వస్తోంది... మొక్కలు జాగ్రత్త!

చలిగాలులు కాస్త తగ్గాయో లేదో...భానుడు తన ప్రతాపం చూపించేస్తున్నాడు. రాబోయే నెలల్లో మొక్కలు ఆరోగ్యంగా పెరగాలంటే ఇప్పుడే కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. సక్యులెంట్లూ, కాక్టస్‌, పొద్దుతిరుగుడూ, ప్యాన్సీ, ఎడీనియం వంటి మొక్కలు సూర్యుడిని ఎక్కువగా ప్రేమిస్తాయి కాబట్టి ఎండ వల్ల వీటికి పెద్దగా ఇబ్బంది ఉండకపోవచ్చు.

Published : 04 Feb 2023 00:17 IST

చలిగాలులు కాస్త తగ్గాయో లేదో...భానుడు తన ప్రతాపం చూపించేస్తున్నాడు. రాబోయే నెలల్లో మొక్కలు ఆరోగ్యంగా పెరగాలంటే ఇప్పుడే కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి.

సక్యులెంట్లూ, కాక్టస్‌, పొద్దుతిరుగుడూ, ప్యాన్సీ, ఎడీనియం వంటి మొక్కలు సూర్యుడిని ఎక్కువగా ప్రేమిస్తాయి కాబట్టి ఎండ వల్ల వీటికి పెద్దగా ఇబ్బంది ఉండకపోవచ్చు. అయినా సరే, నేరుగా తగిలే ఎండ నుంచి  కాస్తయినా రక్షణ కావాలి. మిగిలినవాటిని పెద్ద చెట్ల నీడలోకి లేదా, కాంతి ఎక్కువగా వచ్చే నీడలోకి ఇప్పుడే మార్చుకోవాలి.

కుండీలు మార్చడం, మట్టిని వదులు చేయడం వంటివన్నీ వేసవి రాకుండానే చేసుకోవాల్సిన పనులు. ఎరువులు, మందులూ వంటివి వేయడానికి కూడా ఇదే అనువైన సమయం. ఈ కాలంలో ప్రూనింగ్‌ చేయకపోవడమే మంచిది. ఒకవేళ ఆకులు వేడికి వాడిపోయి గోధుమ రంగులోకి మారుతుంటే... చనిపోతున్న సూచన అనుకుని కత్తిరించేయొద్దు. చినుకులు పడే వరకూ వేచి చూడండి.

ఒకవేళ మట్టి సారంగా లేదంటే...పేడ, కుళ్లిన ఆకుల ఎరువూ వంటివి మట్టిలో కలిపి...కొన్నాళ్లపాటు అంటే చినుకు పడే కాలం వరకూ అలానే వదిలేయండి. అప్పటికి కొత్త మొక్కలు నాటుకునేందుకు అనువుగా మారుతుంది. అయితే, మధ్యలో ఆ కుండీని నీళ్లతో తడపడం మాత్రం మానేయొద్దు.

ఫెర్న్‌, పిటోనియా, మాన్‌స్టెరాస్‌, కలాథియా వంటి మొక్కలు వాతావరణంలోనూ, మట్టిలోనూ ఎక్కువగా తేమను కోరుకుంటాయి. అందుకే ప్లాంటర్‌ బేస్‌ ప్లేట్‌ని గులకరాళ్లతో నింపి నీళ్లుపోసి ఆపై కుండీని పెడితే సరి. లేదా...మొక్క చుట్టూ పీచుని ఉంచి నీళ్లు పోస్తే సరి...ఎక్కువ సమయం తేమగా ఉంటాయి.

ఈ కాలంలో మొక్కలకు నీళ్లెన్ని పోసినా త్వరగా ఆవిరైపోతాయి. లేదా డ్రెయిన్‌ ద్వారా బయటకు వచ్చేస్తాయి. అందుకే ఒకేసారి కాకుండా తరచూ కొద్దికొద్దిగా నీళ్లు పోయండి. అప్పుడు మొక్కలు కావలసిన తడి అందిస్తాయి.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్