నలుపుని తొలగించే ప్యాక్‌లు...

నిత్యం ఎండలో తిరగాల్సి రావొచ్చు. లేదా రాత్రీ పగలూ తేడా తెలియకుండా లైట్ల కాంతిలో పనిచేయాల్సి రావొచ్చు. ఎక్కువకాలం ఇలా చేస్తే.. టాన్‌ పడుతుంది. అలాంటప్పుడు ఈ చిట్కాలు పాటించండి.

Published : 04 Jan 2023 00:48 IST

నిత్యం ఎండలో తిరగాల్సి రావొచ్చు. లేదా రాత్రీ పగలూ తేడా తెలియకుండా లైట్ల కాంతిలో పనిచేయాల్సి రావొచ్చు. ఎక్కువకాలం ఇలా చేస్తే.. టాన్‌ పడుతుంది. అలాంటప్పుడు ఈ చిట్కాలు పాటించండి.

* పెద్దచెంచా బార్లీ గింజలని మిక్సీలో వేసి మెత్తని పొడిగా చేసుకోవాలి. దీనికి అరచెక్క నిమ్మరసంతోపాటూ తగినంత రోజ్‌వాటర్‌ కూడా కలిపి పేస్ట్‌లా తయారు చేసుకోవాలి. ఈ ప్యాక్‌ని ఎండ కారణంగా నల్లబడిన చర్మంపై రాసి అరగంట తర్వాత గోరువెచ్చని నీళ్లతో కడిగేసుకుంటే టాన్‌ పోతుంది.

* నాలుగు ఎండుద్రాక్షలు, ఒక ఎండు ఖర్జూరం నానబెట్టుకుని వాటిని మెత్తని పేస్ట్‌లా చేసుకోవాలి. ఈ మిశ్రమానికి కొద్దిగా పండిన బొప్పాయి గుజ్జు, కాసిన్ని పాలు, చిటికెడు కలపాలి. ఈ ప్యాక్‌ని ముఖానికి పట్టించి ఆరిన తర్వాత కడిగేస్తే ముఖం కాంతిని సంతరించుకుంటుంది.

* కాలంతో పనిలేకుండా కొందరి చర్మం నిర్జీవంగా నల్లగా మారుతుంది. ఇలాంటివారు చందనం, పెరుగు, ముల్తానీ మట్టి కలిపి ప్యాక్‌ వేసుకోవాలి. అరగంటాగి గోరువెచ్చని నీళ్లతో కడిగేసుకుంటే ముఖం కాంతులీనుతుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్