Beauty Gadget: బన్‌ని ‘స్టైల్‌’గా బంధించేద్దాం!

ముందుంది వేసవి కాలం.. జుట్టును విరబోసుకోవడం కంటే.. కొప్పు వేసుకోవడానికే చాలామంది అమ్మాయిలు ఇష్టపడుతుంటారు. మరి, దాన్ని అలాగే వదిలేయకుండా.. స్టైలిష్‌గా హంగులద్దాలనుకుంటే.. ప్రస్తుతం మార్కెట్లో బోలెడన్ని బన్ యాక్సెసరీస్‌ దొరుకుతున్నాయి. ‘స్టిక్‌ బన్‌ పిన్‌’ కూడా.....

Published : 13 Feb 2023 18:00 IST

ముందుంది వేసవి కాలం.. జుట్టును విరబోసుకోవడం కంటే.. కొప్పు వేసుకోవడానికే చాలామంది అమ్మాయిలు ఇష్టపడుతుంటారు. మరి, దాన్ని అలాగే వదిలేయకుండా.. స్టైలిష్‌గా హంగులద్దాలనుకుంటే.. ప్రస్తుతం మార్కెట్లో బోలెడన్ని బన్ యాక్సెసరీస్‌ దొరుకుతున్నాయి. ‘స్టిక్‌ బన్‌ పిన్‌’ కూడా అలాంటిదే!

పేరుకు తగ్గట్లే స్టిక్‌ను పోలి ఉండే ఈ యాక్సెసరీలోనూ విభిన్న డిజైనర్‌ పిన్స్‌ లభిస్తున్నాయి. ఆర్టిఫిషియల్‌ పువ్వులు, గవ్వలు, ఆక్సిడైజ్‌డ్‌ మెటల్‌తో తయారుచేసినవి, చెక్కతో రూపొందించినవి, హ్యాంగింగ్స్‌ ఉన్నవి, యాంటిక్‌ పిన్స్‌, ట్రాన్స్‌పరెంట్‌ తరహావి, వంపులు తిరిగినవి.. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా డిజైన్లే ఉన్నాయి. విభిన్న ప్రింట్స్‌ ముద్రించిన రంగురంగుల స్టిక్స్‌ కూడా దొరుకుతున్నాయి. మరికొన్ని ‘యు’ ఆకృతిలో ఉన్నవి కూడా లభిస్తున్నాయి. వీటిని డ్రస్‌కు మ్యాచింగ్‌గానూ ఎంచుకోవచ్చు.. లేదంటే కాంట్రాస్ట్‌గా ఉండేలా కూడా చూసుకోవచ్చు.. కొప్పు వేసుకున్నాక.. అది ఊడిపోకుండా ఈ స్టిక్‌ని మధ్యలో గుచ్చితే సరి.. అటు అందంగా, స్టైలిష్‌గానూ మెరిసిపోవచ్చు.. సౌకర్యవంతంగానూ కనిపించచ్చు. అలాంటి విభిన్న స్టిక్‌ బన్‌ పిన్స్‌పై మీరూ ఓ లుక్కేయండి!

Photos: Amazon.in

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్